Mallikarjun Kharge: తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పేదలను ఆదుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో మల్లికార్జున ఖర్గే ప్రసగించారు.
ప్రతి ఒక్కరిపై రూ.5లక్షల అప్పు..(Mallikarjun Kharge)
తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేశారని… ప్రధాని మోదీ పాలనలో కార్పొరేట్లు మాత్రమే బాగుపడుతున్నారని ఖర్గే విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, ఉద్యోగాల భర్తీ చేయడంలేదని ధ్వజమెత్తారు.తెలంగాణలో మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రం. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. తెలంగాణలో ప్రతి ఒక్కరిపై రూ.5లక్షల అప్పు ఉంది.తెలంగాణ ఎవరి కోసం ఇచ్చారు?.. ఎవరు ఇచ్చారు ? తెలంగాణ ఇవ్వగానే కేసీఆర్ సోనియా ఇంటికి వెళ్లారు.తెలంగాణ ఇచ్చిన సోనియాను మోసం చేసింది ఎవరు?తెలంగాణ ఇచ్చిన సోనియాను బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు అంటూ ఖర్గే మండిపడ్డారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పనిచేస్తుందని ఖర్గే అన్నారు. రైతు కూలీల కోసం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చామన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ఖర్గే హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.