Site icon Prime9

BRS MLCs Defect to Congress: తెల్లవారితే అమావాస్య అని .. అర్దరాత్రే పార్టీ ఫిరాయించిన ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు

BRS MLCs

BRS MLCs

BRS MLCs Defect to Congress:బీఆర్ఎష్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆరుగురు ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి.. దీపాదాస్ మున్షీల సమక్షంలో కాంగ్రస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో దండే విఠల్, భాను ప్రసాద్.. ఎం.ఎస్.ప్రభాకర్, బొగ్గారపు దయానంద్,..ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య ఉన్నారు. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత.. బీఆర్ఎష్ ఎమ్మెల్సీలు.. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుని.. అక్కడ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

సీఎం ఢిల్లీ నుంచి రాగానే.. (BRS MLCs Defect to Congress)

గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సమావేశమైన ఎమ్మెల్సీలు రాత్రి 11.30 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి రాగానే అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాలె యాదయ్య ఉన్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ కూడా కాంగ్రెస్‌లో చేరారు.

 

Exit mobile version