Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డి పల్లిలో దారుణం చోటుచేసుకుంది.రాజు అనే వ్యక్తి ఆస్తి కోసం సొంత అక్క ఆశమ్మను హతమార్చేందుకు లక్ష రూపాయల సుపారీ ఇచ్చాడు.పథకం ప్రకారం ఇరవై రోజుల క్రితం డేవిడ్ అనే వ్యక్తితో మరో ఇద్దరు కలిసి రాజు అక్క ఆశమ్మను హత్య చేసేందుకు కుట్ర పన్నారు.
మొదట వారి ప్లాన్ సక్సెస్ కాకపోవడంతో నాలుగు రోజుల తర్వాత మరోసారి ప్లాన్ చేశారు. గ్రామంలో అనుమానాస్పందంగా తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తుండగా దొంగలు అనుకొని పట్టుకున్న గ్రామస్తులు వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. వారిలో ఇద్దరు పరారవ్వగా….పోలీసుల అదుపులో ఉన్న డేవిడ్ తప్పించుకునేందుకు వేరొకరి పేరు చెప్పి పోలీసులను తప్పుదోవ పట్టించి ధారూర్ వెళ్ళిపోయాడు.ఇంటికి వెళ్ళిన డేవిడ్ తమ ప్లాన్ బయటపడిపోతుందని భయపడి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కాల్ డేటాతో బయటకు వచ్చిన నిజాలు..(Vikarabad)
పోలీసులు, గ్రామస్తులు కొట్టడం వల్లే డేవిడ్ చనిపోయాడంటూ ధారూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు డేవిడ్ బంధువులు.దీంతో సంచలనంగా కేసు మారింది.డేవిడ్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.డేవిడ్ తో బసిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి పదే పదే మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. ఆస్థి కోసం సొంత అక్క ఆశమ్మను హత్య చేసేందుకు సుపారీ మాట్లాడినట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు రాజు.ప్లాన్ మిస్ కావొద్దంటూ…ఈ రోజు పూర్తి చేయాలంటూ రాజు సుపారీ మాట్లాడిన డేవిడ్ తో వాట్సాప్ చాట్ చేశాడు.విచారణ అనంతరం రాజుపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలింంచారు.