CM Revanth Reddy:ఎన్నికల వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రది మోదీ పై విరుచుకు పడుతున్నారు .మోదీ తెలంగాణకు చేసింది ఏమి లేదు గాడిద గుడ్డు అంటూ సెటైరికల్ గా ప్రచారం చేతున్న రేవంత్ రెడ్డి తాజాగా మరో సారి హాట్ కామెంట్స్ చేసారు . రిజర్వేషన్లు రద్దు చేయాలని భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
నా వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలున్నారు..(CM Revanth Reddy)
ఈ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలవాలని భాజపా చూస్తోందని.. తద్వారా దేశాన్ని అమ్మేయాలని భావిస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన జనజాతర సభలో రేవంత్ మాట్లాడారు. పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని , రాష్ట్రంలో ప్రజల అండతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు గతం కంటే భిన్నమన్నారు. బలహీన వర్గాలకు దక్కాల్సిన అవకాశాలు, నిధులు రాలేదు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ ఇచ్చింది. రిజర్వేషన్లు రద్దు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు పరిస్థితి ఏంటని నేను ప్రశ్నిస్తే ,నా మీద పగబట్టి మోదీ, అమిత్‌షా నాపై దిల్లీలో కేసు పెట్టారు అని పేర్కొన్నారు . ఈడీ, సీబీఐ, ఐటీతోనే కాదు చివరికి దిల్లీ పోలీసులతో కూడా భయపెట్టాలని చూస్తున్నారన్నారు . కేసులకు నేను భయపడను , నన్ను చర్లపల్లి జైలుకు కేసీఆర్ పంపితే తిరగబడి కొట్లాడాం. మీ దగ్గర సీబీఐ, ఈడీ, పోలీసులు ఉండొచ్చు.. నా వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలున్నారు అని అన్నారు . మోదీ గుజరాత్ వ్యక్తిలా వచ్చి మనల్ని తిట్టారు.. శపించారు. ఐదు రోజుల్లో ఇస్తామన్న పసుపు బోర్డు ఐదేళ్లయినా ఇవ్వలేదని విమర్శించారు .
గత 20 ఏళ్ల నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను అయినా భయపడకుండా పోరాడాను అని అన్నారు . గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణలో పెత్తనం చేద్దామనుకుంటున్నారు ఈ ఎన్నికల్లో తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ ఆధిపత్యానికి మధ్య పోటీ అంటూ ఆవేశంగా మాట్లాడారు . ప్రెస్ మీట్ పెట్టి భాజపా కుట్రలు బయటపెడతా, రాజ్యాంగాన్ని ఎలా మార్చాలని చూస్తున్నారో వివరిస్తానంటూ తెలిపారు . రాజ్యాంగం మార్పు అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలోనే చేర్చారని , దీనికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు .. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కొనసాగించాలని చెప్పినందుకు నాపై కేసా? గుజరాత్ నుంచి వచ్చి నా రాష్ట్ర నడిగడ్డపై నిలబడి సీఎంను బెదిరిస్తారా? మోదీ భయపెడితే బెదరడానికి ఇక్కడెవరూ లేరంటూ రేవంత్ మండి పడ్డారు .