Site icon Prime9

Telangana BJP: తెలంగాణలో పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ

Telangana BJP

Telangana BJP

Telangana BJP: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకత్వం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పలు జిల్లాలు, ఆరు మోర్చాలకు అధ్యక్షులను మార్చింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నియమితులైన మోర్చా,జిల్లా అధ్యక్షులకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫోన్ చేసి సమాచారం అందించారు.

జిల్లా అధ్యక్షులు వీరే..(Telangana BJP)

నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా దినేష్ కుమార్,పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా చందుపట్ల సునీల్ ,సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా గోదావరి అంజిరెడ్డి,సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా మోహన్ రెడ్డి,యాదాద్రి జిల్లా అధ్యక్షుడిగా పాశం భాస్కర్,వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా డి నారాయణ,వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మాధవరెడ్డి,నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ వర్షిత్ రెడ్డి,ములుగు జిల్లా అధ్యక్షుడిగా బలరాం,మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా పీ శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా గంట రవిలను నియమించారు. అదేవిధంగా ఎస్టీ మోర్చా కు కళ్యాణ్ నాయక్, ఎస్సీ మోర్చాకు కొండేటి శ్రీధర్, యువ మోర్చాకు మహేందర్, ఓబీసీ మోర్చాకు ఆనంద్ గౌడ్, మహిళ మోర్చాకు డాక్టర్ శిల్పా, కిసాన్ మోర్చాకు పెద్దోళ్ల గంగారెడ్డి లను నియమించారు.

లోక్ సభ ఎన్నికల నేపత్యంలో పార్టీ బలోపేతం పై దృష్టి సారించిన బీజేపీ | BJP | Prime9 News

 

Exit mobile version
Skip to toolbar