Amit Shah Comments: ఢిల్లీలో మోదీ ప్రభుత్వం ఉందని తెలంగాణలో కూడా బీజేపీ పాలనను తీసుకురావాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం అదిలాబాద్ లో జరిగిన బీజేపీ జనగర్జన సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ను గద్దె దించి.. బీజేపీని అధికారంలోకి తేవాలన్నారు. డిసెంబర్ 3 తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు.
కేటీఆర్ ను సీఎం చేయాలనే ఆలోచన..(Amit Shah Comments)
పదేళ్ల కేసీఆర్ పాలనలో సామాన్యులు, రైతులు, ఆదివాసీల సమస్యలు తీరలేదని అమిత్ షా ఆరోపించారు. పదేళ్లలో కేటీఆర్‌ను సీఎం ఎలా చేయాలనే ఆలోచన మాత్రమే చేశారు.కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. కేసీఆర్ పేదల కోసం ఎప్పుడు పనిచేయరని అన్నారు. ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు అయినా ఇచ్చారా? గిరిజనులకు ఇస్తామన్న 3 ఎకరాల భూమి ఇచ్చారా? అంటూ అమిత్ షా ప్రశ్నించారు.తెలంగాణకు డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరం అని అమిత్ షా అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్, కేసీఆర్ దేశాన్ని రక్షించలేరని అన్నారు. నేటి తరం రజాకార్ల నుంచి తెలంగాణను రక్షించేది బీజేపీ మాత్రమేనని అమిత్ షా అన్నారు. తెలంగాణను నెంబర్ 1 చేశానని కేసీఆర్ చెప్తున్నారు. కాని రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నేడు దేశంలో నెంబర్ 1 గా నిలిచింది.మహిళలు, బాలికలపై అత్యాచారాల్లో తెలంగాణ నెం 1. అవినీతి, కుంభకోణాల్లో తెలంగాణ నెంబర్ 1. కేసీఆర్ కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉంది. మజ్లిస్ కనుసన్నల్లో పనిచేసే ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని అమిత్ షా పేర్కొన్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకోసం ఓటు వేయాలంటూ ప్రశ్నించారు. యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఇప్పటి వరకు ఒక్క గ్రూప్-1కి నోటిఫికేషన్ ఇవ్వలేదు. తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారు.రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ అమిత్ షా మొదటిసారిగా తెలంగాణలో విమోచన ఉత్సవాలను నిర్వహించారని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని మోదీ మూడోసారి ప్రధాని అవుతారని చెప్పారు.
షన