Telangana BJP:రాబోయే లోక్హ సభ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు తెలంగాణ బీజేపీ సన్నద్దమయింది. తెలంగాణలో లోక్‌సభ నియోజకవర్గాలకు బీజేపీ ఇన్‌చార్జ్‌లను నియమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి 17 పార్లమెంట్ స్థానాలకి ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇన్‌చార్జ్‌లు వీరే..(Telangana BJP)
ఆదిలాబాద్ ఇన్‌చార్జ్‌గా ఎమ్మెల్యే పాయల్ శంకర్, పెద్దపల్లికి ఎమ్మెల్యే రామారావు పవర్ పటేల్, కరీంనగర్‌కు ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్‌కి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి, జహీరాబాద్‌కి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డిని నియమించారు. మెదక్‌కు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, మల్కాజ్ గిరికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, సికింద్రాబాద్‌కి ఎంపీ లక్ష్మణ్, హైదరాబాద్‌కు ఎమ్మెల్యే రాజా సింగ్, చేవెళ్లకు ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మహబూబ్ నగర్‌కి మాజీఎమ్మెల్సీ రామచంద్రరావు, నాగర్‌కర్నూల్‌కి మాజీ ఎమ్మెల్సీ మారం రంగారెడ్డిని నియమించారు. అలాగే నల్గొండకు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, భువనగిరికి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, వరంగల్‌కు మాజీమంత్రి మర్రి శశిధర్ రెడ్డి, మహబూబాబాద్‌కు మాజీఎంపీ గరికపాటి మోహన్ రావు, ఖమ్మంకు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిని నియమించారు.