Site icon Prime9

Pallavi Prashanth: బిగ్‌బాస్‌ 7 సీజన్‌ విజేత పల్లవి ప్రశాంత్‌ అరెస్ట్

Pallavi Prashanth

Pallavi Prashanth

Pallavi Prashanth: బిగ్‌బాస్‌ 7 సీజన్‌ విజేత పల్లవి ప్రశాంత్‌ను సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కొల్గూరులో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బిగ్ బాస్ టైటిల్‌ గెలిచన రోజు రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో జూబ్లీహిల్స్‌ పోలీసులు ప్రశాంత్‌పై కేసు నమోదు చేశారు. మొత్తం 9 సెక్షన్లని పోలీసులు చేర్చారు. ప్రశాంత్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు తరలించారు.

వాహనాలపై దాడులు..(Pallavi Prashanth)

గత ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ వద్దకు చేరుకున్న పల్లవి ప్రశాంత్‌, అమర్‌దీప్‌ అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. టైటిల్‌ విజేతగా నిలిచిన ప్రశాంత్‌.. స్టూడియోస్‌ నుంచి బయటకు రాగా.. అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే, అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్‌ సైతం బయటకు రావడంతో ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొందరు అమర్‌దీప్‌ కారుపై రాళ్లు విసిరేందుకు యత్నించారు. మరో పోటీదారు అశ్వినీ కారు అద్దాలను పగలగొట్టారు. పలు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్‌ కారు అద్దంతో పాటు విధులు నిర్వర్తించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని కూడా పగలగొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడులకు పల్లవి ప్రశాంత్‌ కారణమని తేల్చారు.

ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్‌ను చేర్చగా, ఎ-2గా అతడి సోదరుడు మనోహర్‌ను, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్‌ను చేర్చారు. అయితే, ఈ కేసులో ఎ-4గా ఉన్న ఉప్పల్‌ మేడిపల్లికి చెందిన లాంగ్‌ డ్రైవ్‌ కార్స్‌లో డ్రైవర్లుగా పనిచేస్తున్న సాయికిరణ్‌ను, అంకిరావుపల్లి రాజును పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా పల్లవి ప్రశాంత్‌, అతడి సోదరుడినీ అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version