Bigg Boss Contestants: హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించారు. బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన అనంతరం స్టూడియో నుంచి బయటికొచ్చే కార్లపై దాడి చేశారు. తొలుత రన్నరప్ అమర్ దీప్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. తర్వాత కాసేపటికి బయటికొచ్చిన ఈ సీజన్ కంటెస్టెంట్ అశ్విని శ్రీ, పాత సీజన్ కంటెస్టెంట్ గీతు రాయల్ వాహనాలపైనా దాడి చేశారు. తరువాత అటుగా వచ్చిన ఒక బస్సుపై కూడా దాడిచేసి అద్దాలు పగుల గొట్టారు.ఈ దాడులలో వీరి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీనిపై అశ్విని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
వారి ప్రవర్తన సరిగా లేదు..(Bigg Boss Contestants)
తన కారు అద్దాలు పగిలిన వీడియోను అశ్విని ఇన్‌స్టాలో పోస్ట్ చేసారు. బిగ్ బాస్ ఫ్యాన్స్ ఇంత దారుణంగా అద్దాలు పగలకొడితే ఏం చేయాలంటూ అశ్విని ఎమోషనల్ అయ్యారు . వారి ప్రవర్తన చాలా గలీజ్‌గా ఉందంటూ అసహనం వ్యక్తం చేసారుపల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపధ్యంలో అభిమానుల రగడ నేపధ్యంలో అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనితో పోలీసులు అన్నపూర్ణా స్టూడియోస్‌కు చేరుకుని అభిమానులను చెదరగొట్టారు.