Pawan Kalyan’s Demand: అల్లూరి వీరమరణం పొంది నేటికి వందేళ్లు అయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. అల్లూరి సీతారామరాజుకి భారతరత్న ప్రకటించాలని పవన్ డిమాండ్ చేశారు. అల్లూరి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఆ బాధ్యతను తాము స్వీకరిస్తామని పవన్ ప్రకటించారు. అల్లూరి స్ఫూర్తిని దేశమంతా చాటాలని జనసేనాని పిలుపునిచ్చారు. దీనిపై ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.
అధికారికంగా పెద్ద ఎత్తున నిర్వహించాలి..(Pawan Kalyan’s Demand)
నేటి తరం దేశవాసులందరికీ శ్రీ అల్లూరి సీతారామరాజు సంకల్పం, పోరాట పటిమ,ధీరత్వం, మృత్యువుకు వెరవని దైర్యం, జ్జాన ఆధ్యాత్మిక సంపదల గురించి తెలియాలి. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని పవన్ కోరారు. అల్లూరి జయంతిని ప్రభుత్వం అధికారికంగా పెద్ద ఎత్తున నిర్వహించాలి. ఆయన స్పూర్తిని దేశమంతటికీ చాటాలి. జనసేన అధికారంలోకి వస్తే ఆ బాధ్యతలను తామే స్వీకరిస్తామని చెప్పారు.
వీరులకు పుట్టుకే గాని గిట్టుక ఉండదు. వారి చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుంది. వారు రగిల్చిన విప్లవాగ్ని సర్వదా జ్వలిస్తూనే ఉంటుంది. కారణజన్ములు తాము చయవలసిన కార్యాన్ని పూర్తి చేసి అదృశ్యమైపోతారు. ప్రజల్లో చైతన్యం రగల్చడానికి వచ్చిన సీతారామరాజు ఆ కార్యం నెరవేర్చి నవయువకుడిగానే మహాభినిష్క్రమణం గావించారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
https://youtu.be/1-O3VbY14d8