Site icon Prime9

Ramachandra Yadav: పుంగనూరు మంత్రి పెద్ది రెడ్డి జాగీరా ? బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్

Ramachandra Yadav

Ramachandra Yadav

Ramachandra Yadav: పుంగనూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు కనిపించకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారంటూ బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆరోపించారు. పుంగనూరు మంత్రి పెద్ది రెడ్డి జాగీరా అంటూ ఆయన ప్రశ్నించారు.

పక్షపాతంగా  సోమల ఎస్సై..(Ramachandra Yadav)

ఈనెల 15వ తేదీ సదుంలో రైతు సమస్యలపై రైతు భేరి బహిరంగ సభకు రావలసిందిగా బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమల మండలంలో బుధవారం రైతులు, ప్రజలను ఆహ్వానించడానికి వెళ్ళగా మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు బీసీవై పార్టీ శ్రేణులను అడ్డుకొని వాహనాలపై రాళ్లు వేసి దాడికి పాల్పడ్డారు. మా గ్రామంలో మంత్రి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయరాదని, మేము చూస్తూ ఊరుకోమని రైతుభేరి కరపత్రాలు చింపివేసి, పలువురుపై దుర్భాషలాడుతూ దాడి చేశారు. సోమల ఎస్సై వెంకట నరసింహులు ఏకపక్షంగా దాడి చేసిన వారిని వదిలేసి ప్రశాంతంగా రైతుభేరి కి ఆహ్వానిస్తున్న బీసీవై పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలను సోమల పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి వారిపై కేసులు నమోదు చేయడానికి ప్రయత్నించడం దారుణం. పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని రామచంద్ర యాదవ్ తెలిపారు.

పుంగనూరు లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కరే రాజకీయాలు చేయాలని రాజ్యాంగంలో ఏమైనా ఉందా? పుంగనూరులో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు. పుంగనూరు లో మంత్రి పెద్దిరెడ్డి, వారి అనుచరులు, కార్యకర్తలు చేస్తున్న దురాగతాలు, దౌర్జన్యాలు, దాడులు, దాష్టికాలను ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం మూడు నెలల్లో ఇంటికి వెళ్లడం ఖాయం. అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి, మంత్రికి వత్తాసు పలికి అక్రమాలను ప్రోత్సహించిన అధికారులకు భవిష్యత్తులో శిక్ష తప్పదంటూ రామచంద్ర యాదవ్ హెచ్చరించారు. వెంటనే సోమల పోలీస్ స్టేషన్లో ఉన్న బీసీవై పార్టీ మహిళలు, నాయకులను విడుదల చేసి, దాడి చేసిన వైసిపి వారిపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ దౌర్జన్యాలను గవర్నర్,డీజీపీ, హైకోర్టు, మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేసారు.

Exit mobile version