Site icon Prime9

Bandla Ganesh: అన్నే నన్ను బతికించాడు.. బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కాళ్లు మొక్కిన బండ్ల గణేష్

Bandla ganesh

Bandla ganesh

Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో కెక్కారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి కాళ్లు మొక్కారు గణేష్. తాను ఏ పార్టీలో లేను అంటూనే రంజిత్ రెడ్డి వెనుక ఉన్నానంటూ ప్రకటించారు. అంతేకాదు రంజిత్ రెడ్డి లేకుంటే తాను ఆత్మహత్య చేసుకునే వాడినని షాకింగ్ కామెంట్స్ చేశారు బండ్ల గణేష్. ఈ సందర్భంగా బండ్ల గణేష్.. ఎంపి రంజిత్ రెడ్డి పాదాలకు నమస్కరించారు. వెంటనే పైకి లేపిన ఎంపీ రంజిత్ రెడ్డి.. గణేష్ భుజాలు తట్టారు. అనంతరం మాట్లాడిన గణేష్.. రంజిత్‌ రెడ్డి లేకుంటే ఆత్మహత్య చేసుకునేవాడిని. రంజిత్ అన్న దేవుడితో సమానం. నేను ఏ పార్టీలో లేను.. కానీ రంజిత్ అన్న వెనుక ఉన్నానని అన్నారు.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే సెవెన్ ఓ క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుంటానని ప్రకటించారు. తరువాత ఎన్నికల ఫలితాలు వచ్చాక సోషల్ మీడియాలో పలువరు గణేష్ ను ట్రోలింగ్ చేసారు. దీనిపై ఇకపై తాను ఏ పార్టీలోనూ చేరబోనని ప్రకటించారు.

Exit mobile version