Site icon Prime9

Bandi Sanjay Bail: బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay Bail: బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్‌ని హన్మకొండ కోర్టు డిస్మిస్ చేసింది. ప్రాసిక్యూషన్ వాదనలతోవిబేధించిన మేజిస్ట్రేట్ కోర్టు పిటిషన్‌ని తోసిపుచ్చింది. పదో తరగతి ప్రశ్నాపత్రం మాల్ ప్రాక్టీస్ కేసులో విచారణకి సహకరించడం లేదని పిపి వాదించారు. అసలు కేసే కుట్ర పూరితమని బండి తరపు లాయర్ వాదించారు. వాదనలు విన్న అనంతరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ని కోర్టు తోసిపుచ్చింది.

పోలీసులు విఫలమయ్యారు..(Bandi Sanjay Bail)

పేపర్ లీకేజీ విషయంలో బండి సంజయ్ కు ప్రమేయం ఉందని నిరూపించడంలో పోలీసులు విఫలమయ్యారని సంజయ్ తరపు న్యాయవాదులు వాదించారు. బండి సంజయ్ ఫోన్ పోయిందని ఫిర్యాదు చేసిన తరువాత కూడా మొబైల్ సబ్మిట్ చేయాలని కోరడమేమిటని వారు ప్రశ్నించారు. కేవలం రాజకీయ కక్షతోనే బండి సంజయ్ ను ప్రభుత్వం వేధిస్తోందని వారన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న తరువాత కోర్టు బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఈ నెల 4వ తేదీన టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీకైందని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు.దీనిపై దర్యాప్తు చేసిన వరంగల్ పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేసారు. బండి సంజయ్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో పోలీసులు కీలక విషయాలను నమోదు చేశారు.

బండి సంజయ్ నిందితుడన్న పోలీసులు..

ప్రశ్నపత్రాల లీకేజీలో బండి సంజయ్ హస్తం ఉన్నట్లు పోలీసులు అందులో పేర్కొన్నారు.దీంతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద భాజపా నేతలు ధర్నాలు చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.నిందితుడితో భాజపా నేత కొద్ది రోజులుగా టచ్ లో ఉన్నట్లు అందులో పేర్కొన్నారు.విద్యార్ధుల్లో గందరగోళం సృష్టించడానికే ఈ లీకేజీలు సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్ పోలీసు కమీషనర్ రంగనాధ్ ఈ కేసులో బండి సంజయ్ ప్రధాన నిందితుడని అందుకే ఏ1 గా చేర్చామని తెలిపారు. పక్క ఆధారాలతోనే తాము బండి సంజయ్ ను అరెస్ట్ చేసామని చెప్పారు. అయితే పబ్లిక్ డొమైన్ లో ఉన్న విషయాన్ని షేర్ చేస్తే నేరస్తుడు ఎలా అవుతాడంటూ ప్రశ్నించిన కోర్టు ఈ నెల 6న అతనికి బెయిల్ మంజూరు చేసింది. దీనితో ఈ బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు తాజాగా పిటిషన్ దాఖలు చేయడం, కోర్టు దానిని డిస్మిస్ చేయడం జరిగింది.

Exit mobile version