Congress MLC Candidates: అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ పార్టీ మరోసారి మొండిచేయి చూపించింది. నిన్నటి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్దిగా దయాకర్ పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ తాజాగా ఆయన పేరును తొలగించి మహేష్ కుమార్ గౌడ్ కు కేటాయిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. దీనితో దయాకర్ కు మరోసారి ఆశాభంగం ఎదురయింది.
దయాకర్ కు మొండిచేయి..(Congress MLC Candidates)
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ స్దానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. బల్మూరి వెంకట్, మహేష్‌కుమార్ గౌడ్ పేర్లు ఖరారయ్యాయి. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. అద్దంకి దయాకర్‌కు మరోసారి మొండిచేయి చూపించింది పార్టీ. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించినట్లు నిన్న ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో సీనియర్లు చక్రం తిప్పారు. దీంతో అద్దంకి దయాకర్‌కు టికెట్ దక్కలేదు. గత ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ ఆశించి అద్దంకి భంగపడ్డాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ వస్తుందనుకున్న సమయంలో కూడా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ స్దానాలకు ఈ నెల 29వ తేదీన పోలింగ్ జరగనుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.