Site icon Prime9

Bala Medhavi : అసమాన ప్రతిభ కనబరుస్తున్న “బాల మేధావి”.. శ్రీ సాయి దేవి భగవాన్ సిధ్విక్ సుహాస్

Bala Medhavi sri saidevi bhagavan sidhwik suhas alladaboyina special story

Bala Medhavi sri saidevi bhagavan sidhwik suhas alladaboyina special story

Bala Medhavi : భారత విద్యా వ్యవస్థలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలిచిన శ్రీ సాయి దేవి భగవాన్ సిధ్విక్ సుహాస్ అల్లడబోయిన మన తెలుగువాడేనండోయ్ .. హైదరాబాద్ నగరానికి చెందిన ఈ యువకుడు ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ యంగ్ టాలెంటెడ్ సూపర్ కిడ్ గురించి ఒక్కసారైనా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. నేటి తరం యువతలో అధికంగా కెరీర్ ని గాలికి వదిలేసి జల్సాలకి బానిసలు అవుతున్న తరుణంలో కొందరు మాత్రమే భవిష్యత్తు కోసం ఒక పద్దతి ప్రకారం ప్రణాళికలు రూపొందించుకొని వాటి కోసం నిరంతరం శ్రమిస్తూ.. మరికొందరికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. ఆ కోవకి చెందిన అరుదైన విద్యార్థే ఈ సుహాస్.

అపారమైన విద్యా ప్రతిభను కలిగి.. చిన్న వయస్సులోనే వివిధ కోర్సులను పూర్తి చేసి.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. సుహాస్ సాధించిన విజయాలు గమనిస్తే.. ఇతర విద్యార్థులకు స్ఫూర్తిని కలిగిస్తాయి. క్రమశిక్షణ, అంకితభావంతో తన లక్ష్యాలను సాధిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. కేవలం చదువుల్లో మాత్రమే కాకుండా పాఠ్యేతర కార్యకలాపాలలో కూడా రాణిస్తూ సామాజిక కార్యకలాపాల్లో సైతం తన వంతు బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. అకడమిక్ ఎక్సలెన్స్‌ను కొనసాగించడమే కాకుండా అతని తోటివారికి సైతం బోధించడానికి నిర్ణయించుకోవడం మంచి విషయం. ఈ రకంగా తన సహచరులకు మాత్రమే కాకుండా తన కన్నా తక్కువ తరగతుల లోని వారికి కూడా రోల్ మోడల్‌గా నిలుస్తున్నాడు.

తెలుగుతో పాటు కన్నడ, ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలలో పూర్తి ప్రావీణ్యం కలిగి.. ఆన్‌లైన్ తరగతుల కోసం తన స్వంత స్టార్టప్‌ను ప్రారంభించడం విశేషం అని చెప్పాలి. అదే విధంగా పాఠశాల విద్యార్థులకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు ఇతర విషయాలలో శిక్షణ ఇవ్వడం వంటివి చేస్తున్నారు. అలాగే పాఠశాల పిల్లలకు యోగా నేర్పించడం, చెస్ శిక్షణ ఇవ్వడంలో దిట్టగా పేరు సంపాదించాడు సుహాస్ .

ఇక విద్య పరంగా చూసుకుంటే.. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ ఒలింపియాడ్ పరీక్షలలో ప్రపంచ ర్యాంకింగ్స్ సాధించాడు. INPhO-53-2023లో జాతీయ టాప్ ర్యాంకర్‌గా నిలిచి.. గోల్డ్ మెడలిస్ట్ 2023 గా అవార్డు అందుకున్నాడు. IPhO-52 (NSEP) (2022)లో జాతీయ స్థాయి క్యాంప్ కి సెలెక్ట్ అయ్యి గోల్డ్ మెడల్ సాధించాడు. IMO-63 (INMO జాతీయ స్థాయి పరీక్ష) 2022లో కూడా అతను బంగారు పతకాన్ని అందుకున్నాడు. RMO (ప్రాంతీయ గణిత ఒలింపియాడ్) (2021)లో జాతీయ ర్యాంక్-35 పొందారు. ఇంటర్నేషనల్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ (IJSO)-18 మరియు అంతర్జాతీయ ఖగోళశాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రం, ఒలింపిక్స్, 2022 లో బంగారు పతకాన్ని అందుకున్నాడు. 2021లో అతను గోల్డ్ మెడల్ ర్యాంక్ 3 ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ (IESO)-14 పొందాడు.

ఈ విధంగా ఎన్నో అవార్డులు సాధించడంతో పాటు అకడమిక్ గా కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. టోఫెలిబ్ట్- 11, శాట్ -1500, ప్రపంచ ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ గణిత పరీక్షలో అత్యుత్తమంగా నిలిచాడు. శాప్ స్కాలర్‌షిప్‌లో ఇన్ఫినిటీ లెర్నింగ్ ద్వారా అంతర్జాతీయ అత్యుత్తమ విద్యా పనితీరు కోసం $1,20,000.. ఒలింపిక్ (గణితం మరియు భౌతికశాస్త్రం) ట్యూటర్‌గా పని చేయడం ద్వారా $40,000 సంపాదించి ఔరా అనిపించాడు. వాటితో పాటు HARVARD C50 నుంచి ఇంట్రడక్షన్ టు సీఏస్ ఇంట్రడక్షన్ టు సీఏస్.. ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ ఫర్ ఫెనోమెన్.. వెబ్ ప్రోగ్రామింగ్ విత్ పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్ లలో సర్టిఫికెట్ లను పొందడం గమనార్హం. ఇక ఇంతటి ప్రతిభా పాటవాలతో భారతదేశ ఖ్యాతి నలుమూలకు చాటిచెప్తున్న సుహాస్ సమర్థతను తెలుసుకున్న భారతదేశ ఉన్నతాధికారులు ..పలువురు పారిశ్రామిక వేత్తలు ఇతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar