Ayesha Meera’s murder case:16 సంవత్సరాల తరువాత ఇబ్రహీంపట్నం బిఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా హత్య కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ కేసులో పోలీసులకి రిపోర్టు ఇచ్చిన పూసపాటి వెంకట కృష్ణప్రసాద్‌ని విచారణకి హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు.
సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించిన కోర్టు..( Ayesha Meera’s murder case)
సీఆర్పీసీ 160 ప్రకారం ఇవాళ విచారణకి హాజరు కావాలని సిబిఐ ఆదేశించింది. 2007 డిసెంబర్ 26న ఆయేషా మీరా తానుంటున్న దుర్గా లేడీస్ హాస్టల్ ఆవరణలోనే అత్యాచారానికి, హత్యకి గురైంది. ఈ కేసులో నందిగామకి చెందిన సత్యంబాబుని దోషిగా నిర్థారించి కింది కోర్టు పదేళ్ళ శిక్ష విధించింది. కానీ హైకోర్టు సత్యంబాబుని నిర్దోషిగా తేల్చి విడుదల చేసింది. దీనితో ఈ కేసు సిబిఐకి చేరింది. సీబీఐ మూడు నాలుగేళ్ళుగా ఈ కేసుని దర్యాప్తు చేస్తోంది.
డిసెంబర్ 2018లో ఏపీ హైకోర్టు ఆదేశాలను అనుసరించి సీబీఐ దర్యాప్తును చేపట్టింది. ర్యాప్తు సమయంలో అనుమానితులందరినీ ప్రశ్నించింది. డిసెంబర్ 13, 2019న రీ-పోస్ట్‌మార్టం కోసం అయేషా అవశేషాలను వెలికితీసింది. ఆయేషా దారుణంగా హత్యకు గురైనట్లు కనుగొనబడింది.