Site icon Prime9

Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం ఒంటిగంటా నాలుగు నిమిషాలకి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిని ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంగా రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరో 11మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి జిఎడి ప్రొటోకల్ డిపార్ట్‌మెంట్ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.

ఎల్బీ స్టేడియంలో మూడు వేదికలు..(Revanth Reddy)

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్దమయింది. ఎల్బీ స్టేడియంలో మొత్తం మూడు వేదికలు ఏర్పాటు చేశారు. ప్రజా వేదిక పై నుంచి రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా కార్యక్రమాలను అధికారులు ఏర్పాటు చేశారు. లెఫ్ట్ సైడ్ 63 సీట్లు, రైట్ సైడ్ 150 సీట్లతో వేదికలు ఏర్పాటు చేసారు. అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ ఉంటుంది.తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ కూడా ఏర్పాటవుతోంది. ముప్పై వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.స్టేడియం బయట చూసేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఉంటాయి. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మంత్రులు వీరే..

ఇలాఉండగా ప్రమాణ స్వీకారం సందర్బంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపైనే రేవంత్ రెడ్డి తొలి సంతకం చేసే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారం అనంతరం కాంగ్రెస్ పార్టీ కృతజ్జతా సభ నిర్వహిస్తుంది. తరువాత రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా సెక్రెటేరియేట్ కు వెళ్లనున్నారు. కొత్త సీఎం కోసం అధికారులు ప్రత్యేక కాన్వాయ్ ను ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటికే మంత్రుల వివరాలను కాబోయే సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు పంపించారు. దాంతో పార్టీ ఇన్ చార్జ్ ఠాక్రే.. కాబోయే మంత్రులకు సీనియర్ లీడర్లకు ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నారు. భట్టి విక్రమార్కకు మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. అధిష్టానం చొరవతో ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కేబినేట్ లోకి తీసుకున్నారు. వీరితో పాటు దామోదరం రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లకు ఠాక్రే ఫోన్ చేసి.. ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

 

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం | Revanth Reddy Swearing In Ceremony | Prime9

 

 

Exit mobile version
Skip to toolbar