Site icon Prime9

Adimulapu Suresh : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ మోకాలికి సర్జరీ

Adimulapu Suresh

Adimulapu Suresh

Adimulapu Suresh : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ వీల్ ఛైర్‌లో ఉన్న చిత్రాలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ నేపధ్యంలో మంత్రి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సురేష్ కు మోకాలికి సర్జరీ జరిగినట్లు తెలిపారు.

కొద్దీ రోజుల క్రితం ఆదిమూలపు సురేష్ మోకాలి నొప్పి తీవ్రతరం కావడం తో వైద్యుల సూచన మేరకు ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని వైద్యులు తెలిపారు. జూన్ నెలలో మంత్రి సురేష్ అస్వస్దతకు గురయ్యారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్న మంత్రి అస్వస్థతకు గురికావడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అత్యవసరంగా శస్త్ర చికిత్స చేసి యాంజియోప్లాస్టి చేశారు వైద్యులు. విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ మంత్రి మంత్రి సురేష్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలని సూచించారు.

ఇలావుండగా మంత్రి సురేష్ త్వరలోనే రాష్ట్ర ప్రజలతో పాటు, తన యర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు.తనపై అభిమానం చూపుతున్న రాష్ట్ర ప్రజలు యర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version