Site icon Prime9

Pawan Kalyan: అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామికం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

pawan kalyan

pawan kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో 42 రోజులనుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ప్రజాస్వామ్య బద్దంగా లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. నామమాత్రపు వేతనాలతో సేవలందిస్తున్న మహిళలతో సామరస్యపూర్వకంగా చర్చలు జరపకుండా విధులనుంచి తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం, పోలీసు చర్యలకు దిగడం పాలకుల ధోరణిని తెలియజేస్తోందన్నారు.

పాజిటివ్ గా ఆలోచించాలి..(Pawan Kalyan)

సీఎంకు కోటి సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ఇచ్చేందుకు ఛలో విజయవాడ కార్యక్రమం చేపడితే అర్దరాత్రివేళ పోలీసులు అంగన్వాడీ మహిళలను ఈడ్చివేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా అంతన్వాడీ సిబ్బందిని అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బంది పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని కూడా ఖండిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చిన్నపాటి జీతాలతో పనిచేస్తున్న వారిపట్ల పాజిటివ్ గా ఆలోచించాలని కోరుతన్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మరోవైపు అంగన్వాడీల ఆందోళనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. విధుల్లో చేరని అంగన్‌వాడీలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 10గంటల లోపు విధుల్లో చేరని అంగన్‌వాడీల తొలగించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే విధుల్లోకి వచ్చిన హెల్పర్లకు, వర్కర్లుగా పదోన్నతి కల్పించాలన్నారు. అంతేకాకుండా విధుల్లోకి వస్తున్న వారిని అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించింది.

 

 

Exit mobile version