AP Ananganwadis: అంగన్ వాడీలపై ఏపీ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అంగన్ వాడీల సమ్మెని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్ వాడీ కార్యకర్తలపై ఎస్మాని ప్రయోగించింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నం.2ను జారీ చేసింది. ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.
అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మెలోకి దిగితే.. జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ఎస్మా చట్టం పనికి వస్తుంది.అంగన్‌వాడీలు నిత్యావసర సేవల పరిధిలోకి రానప్పటికీ.. వెంటనే విధుల్లో చేరాలని ప్రభుత్వం జిఓ 2 జారీ చేసి ఎస్మా విధించింది. సమ్మె చట్టవిరుద్ధమని ప్రభుత్వం శనివారం జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ద్వారా నిషేధించింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ కార్మికులు సమ్మెపై ఆరు నెలల పాటు నిషేధం అమల్లో ఉంటుంది.
ఎస్మా అంటే..(AP Ananganwadis)
ఎస్మా అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్. దేశంలో సాధారణ జీవన నిర్వహణకు అవసరమైన కొన్ని ముఖ్యమైన సేవల్లో పని చేయడానికి నిరాకరిస్తూ సమ్మె చేస్తున్న ఉద్యోగులను నిషేధించడానికి ప్రభుత్వం కోరవచ్చు.సమ్మెను ప్రారంభించిన వ్యక్తులు మరియు దానిని ప్రేరేపించే వ్యక్తులు క్రమశిక్షణా చర్యలకు బాధ్యత వహిస్తారు, ఇందులో తొలగింపు కూడా ఉండవచ్చు. ఎస్మా ప్రయోగించిన తర్వాత సమ్మె చట్టవిరుద్ధం అయినందున, ఈ ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. సమ్మె చేస్తున్న వ్యక్తులను వారెంట్ లేకుండా అరెస్టు చేసే అధికారం ఏ పోలీసు అధికారికైనా ఉంటుంది. సమ్మెలో పాల్గొనే లేదా ప్రేరేపించే వ్యక్తులకు జైలు శిక్ష విధించబడుతుంది, ఇది ఒక సంవత్సరం వరకు పొడిగించబడవచ్చు లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయి.