Site icon Prime9

AP ECET Results: ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల

AP ECET Results Released

AP ECET Results Released

AP ECET Results: ఏపీ ఈసెట్ 2024 – ( ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ఫలితాలు విడుదల అయ్యాయి. అనంత‌పురం జేఎన్‌టీయూ లోఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఈసెట్ ఫలితాలు విడుదల చేశారు. ఈసెట్ ఫలితాలలో బాలికలు 93.34 శాతం, బాలురు 89.35 శాతం విద్యార్ధుల ఉత్తీర్ణత సాధించారు.

మే8న జరిగిన ప్రవేశపరీక్ష..(AP ECET Results )

ఈ సందర్బంగా హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈసెట్ ఫలితాలలో హైదరాబాద్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ఎక్కువ ఉందని… అత్యల్పంగా విజయనగరం జిల్లా ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. . ఏపీ ఈసెట్ 2024(ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ఫలితాల కోసం https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspx వెబ్‌ సైట్‌ చూసుకోవాలని అధికారులు ప్రకటించారు.ఈసెట్ ప్రవేశ పరీక్షను మే 8న రాష్ట్రవ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాలలో నిర్వహించగా 6, 369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈసెట్ జవాబు కీని మే 10న విడువల చేయగా నేటి ఉదయం 11 గంటల తరువాత ఫలితాను విడుదల చేసారు.

Exit mobile version