Site icon Prime9

AP Deputy CM Pawan Kalyan: ఐఏఎస్ అధికారి కృష్ణ తేజకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు

Deputy CM Pawan Kalyan

Deputy CM Pawan Kalyan

AP Deputy CM Pawan Kalyan: జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికైన తెలుగు ఐఏఎస్ అధికారి ఎమ్.వి.ఆర్.కృష్ణ తేజకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈమేరకు పవన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణ తేజ కేరళ రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తూ ప్రజా సంక్షేమం, బాలల హక్కులు ,పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని కొనియడారు. ప్రస్తుతం త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న కృష్ణ తేజ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు ఉత్తమ విధానాలు అనుసరించారు. అదే విధంగా కరోనా కష్ట కాలంలో, కేరళ వరదల వచ్చిన విపత్తు సమయంలో కృష్ణ తేజ విధి నిర్వహణలో చూపిన అంకిత భావాన్ని ఆ రాష్ట్ర ప్రజలు మరచిపోలేదని పవన్ పేర్కొన్నారు. ఆయన తన విధినిర్వహణలో ప్రజలకు మరింతగా సేవలు అందిస్తూ ఉద్యోగులకు, యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ కల్యాణ్ ఆ ప్రకటనలో తెలిపారు .

ఇంతకీ కృష్ణ తేజది ఏ జిల్లా?..(AP Deputy CM Pawan Kalyan)

కేరళ క్యాడర్ తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజ ఆంద్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట. మధ్యతరగతి కుటుంబంలో జన్మిం చిన కృష్ణ తేజ తండ్రి శివానంద కుమార్ హోల్ సేల్ వ్యాపారి, తల్లి భువనేశ్వరి గృహిణి. ఐఏఎస్ కావాలనే పట్టుదలతో పరీక్షలు రాశారు .నాలుగవ ప్రయత్నంలో 66వ ర్యాంకు సాధించాడు. త్రిస్సూర్ లో బాల హక్కుల రక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టి, జిల్లాను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. ఆయన చేసిన కృషికిగాను జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ అవార్డు వరించింది.

Exit mobile version
Skip to toolbar