AP CM YS Jagan: విజయదశమినుంచి విశాఖనుంచే ప్రభుత్వ పాలన సాగుతుందని ఏపీ సిఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గురువారం జరిగిన కేబినేట్ భేటీలో సీఎం జగన్ ఈ విషయాన్ని స్పష్టం చేసారు. దసరా పండుగ విశాఖలోనే జరుపుకుందామని.. ప్రస్తుతానికి సిఎంఓ తరలిస్తామని మంత్రులకి జగన్ చెప్పారు. త్వరలో ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ఉంటుందని ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలని, ఎన్నికలపై కేంద్ర నిర్ణయాన్ని అనుసరించాలని నిర్ణయించామని సిఎం జగన్ తెలిపారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు స్కాములపై చర్చిద్దామని జగన్ చెప్పారు.
కేబినెట్ భేటీలో నిర్ణయాలు ఇవే..(AP CM YS Jagan)
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్ అమలు బిల్లుకు కేబినెట్ ఇవాళ ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యే నాటికి సొంత ఇంటి స్ధలం ఉండేలా చూడాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. రిటైర్ అయిన ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు ఆరోగ్యశ్రీ వర్తింపచేయాలని నిర్ణయం తీసుకున్నారు.. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు, ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లు ప్రైవేటు యీనివర్శిటీల చట్టంలో సవరణ బిల్లుకు కూడా ఆమోదం తెలిపారు. కురుపాం ఇంజనీరింగ్ కాలేజీలో 50 శాతం గిరిజనులకు రిజర్వ్ చేయాలని నిర్ణయించారు. పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుకూ ఆమోదం తెలిపారు