Site icon Prime9

YS sharmila: సీఎం జగన్ కు మరో లేఖ రాసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

sharmila

sharmila

YS:sharmila:ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జగన్‌కు మరో లేఖ రాశారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మద్య నిషేధం ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. పాక్షికంగా అయినా మద్యపాన నిషేధం జరిగిందా అని ప్రశ్నించారు. మూడు దశల్లో మద్యపాన నిషేధం చేస్తామన్న జగన్.. దానిని అమలు చేశాకే ఓట్లు అడుగుతామన్నారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిని పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల రక్త మాంసాల మీద వ్యాపారం చేశారని విమర్శించారు.

షర్మిల లేఖలో ప్రశ్నలు ఇవే..(YS sharmila)

మద్యనిషేధం చేస్తామన్న హామీని ఎందుకు అమలు చేయలేదు?
మద్య నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నారు. మద్యం అమ్మకాలను భారీగా పెంచి.. ఓట్లు అడిగేందుకు ఎందుకొచ్చారు?
మద్యం అమ్మకాల్లో ఆదాయాన్ని రూ. 20 వేల కోట్ల నుంచి రూ. 30 వేల కోట్లకు పెంచుకున్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగినట్టు కాదా?
మద్యం అమ్మకాలను ప్రజల రక్తమాంసాలతో చేస్తున్న వ్యాపారం అని మీరు అన్నారు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి?
నకిలీ బ్రాండ్లను అమ్ముతూ ప్రజల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు?
బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ. 11 వేల కోట్లు సేకరించాలని ఎందుకు అనుకున్నారు?
ఆసరా, అమ్మఒడి, చేయూత పథాకాల అమలు బాధ్యతను బెవరేజెస్ కార్పొరేషన్ కు ఎందుకు అప్పగించారు?
రాష్ట్రంలో 20.19 లక్షల మంది మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డారు. ఇవి మీ ప్రభుత్వ వైఫల్యం కాదా?
మాదకద్రవ్యాలు పట్టుబుడుతున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఎందుకుంది? అంటూ షర్మిల తన లేఖలో తొమ్మిది ప్రశ్నలను అడిగారు.

Exit mobile version