Site icon Prime9

TTD Annual Budget: టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపిన పాలకమండలి

TTD Annual Budget

TTD Annual Budget

TTD Annual Budget: సోమవారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో 5 కోట్ల 141 లక్షల అంచనాతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్ కి ఆమోదం తెలిపింది. పాలక మండలి నిర్ణయాలను చైర్మన్ కరుణాకర్ రెడ్డి వివరించారు.

ఉద్యోగులకు జీతాలు పెంపు..(TTD Annual Budget)

ధర్మప్రచారంలో భాగంగా బంగారు డాలర్ల తరహాలో శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళ సూత్రాలను భక్తులకు అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. మంగళసూత్రాలు 5,10,గ్రాములు తయారుచేసి విక్రయిస్తామన్నారు. టీటీడీ పోటు విభాగంలోని 70 మంది ఉద్యోగులుకు స్కిల్డ్ లేబర్ గా గుర్తిస్తూ 15 వేల రూపాయలు జీతాలు పెంచుతున్నట్లు చెప్పారు.టీటీడీ ఆధ్వర్యంలోని 6 వేదపాఠశాలల్లో 51 మంది అధ్యాపకుల జీతాలను 35 వేల నుంచి 54 వేలకు పెంచుతున్నామన్నారు. అదేవిధంగా వాటర్ వర్క్స్, అన్నప్రసాదం,టీటీడీ స్టోర్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెంచుతామన్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలలో విధులు నిర్వర్తిస్తూన్న అర్చకుల జీతాలు పెంచుతున్నామని తెలిపారు. వేదపండితుల పెన్షన్ 10 వేలు నుంచి 12 వేలుకు పెంచుతున్నట్లు చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలోని 26 ఆలయాలు, టీటీడీ పరిధిలోకి తీసుకున్న 34 ఆలయాల్లో భక్తులు సౌకర్యార్దం ఉద్యోగుల నియామకానికి ప్రభుత్వ అనుమతికి విజ్జప్తి చేసామని చెప్పారు.

30 కోట్ల వ్యయంతో గోగర్బం నుంచి ఆకాశగంగ వరకు నాలుగు వరుసలు నిర్మాణం చేపడాతమని కరుణాకర్ రెడ్డి తెలిపారు. నారాయణవనంలో వీరభధ్రస్వామి ఆలయం అభివృద్దికి 6.9 కోట్లు కేటాయించామన్నారు.స్విమ్స్ అభివృద్ది పనులుకు 148 కోట్లు, సప్తగిరి అతిధి గృహలు అభివృద్ది పనులకు 2.5 కోట్లు కేటాయించామని తెలిపారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కేటాయింపుకు సహకరించిన సియం జగన్ కి కృతజ్ఞతలు తెలుపుతు తీర్మానం చేసామన్నారు. పిభ్రవరి 3 నుంచి 5వ తేది వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లు కరుణాకర్ రెడ్డి తెలిపారు. దీనికి 57 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరవుతారని చెప్పారు. ధార్మిక ప్రచారంలో భాగంగా వారి సూచనలు,సలహాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version