Site icon Prime9

Ysrcp : వైకాపా ఎమ్మెల్యే, ఎంపీ లకు చేదు అనుభవం.. ఎక్కడ ? ఏం జరిగిందంటే ??

ysrcp mla musthafa and mp ayodhya ramireddy facing protest aginst them

ysrcp mla musthafa and mp ayodhya ramireddy facing protest aginst them

Ysrcp : ఏపీలో రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలియడం లేదు. ఇన్నాళ్ళూ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ మాటల యుద్దాలు జరగడం గమనించవచ్చు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సొంత పార్టీ నేతలే విమర్శలు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఇలాంటి తరుణంలో తాజాగా వైకాపా ఎమ్మెల్యే, ఎంపీ లకు ప్రజలందరి ముందే చేదు అనుభవం జరగడం ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రంలోని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా రాజకీయాలు వేడేక్కాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా సొంత పార్టీ మేయర్ పైనే ఆగ్రహం వ్యక్తం చేసి.. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఉన్న తనకి అభివృద్ది పనుల గురించి సమాచారం ఇవ్వడం లేదని.. మాట వినడం లేదని వాపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు రావాలని ఎంపి అయోధ్య రామిరెడ్డిని ఆయన ఆహ్వానించారు. దీంతో ఎంపి అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా గుంటూరు నగరంలోని జున్ను షాహిద్ నగర్ కు వెళ్ళారు. అక్కడున్న పీకల వాగును స్థానిక ప్రజలు, నేతలతో కలసి పరిశీలిస్తున్నారు. అప్పుడే వారిద్దరికీ ఒక చేదు అనుభవం ఎదురైంది.

ఇక ఇదే ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ముస్తఫా నగరాన్ని అభివృద్ధి చేయడం లేదంటూ స్థానికులు మండిపడ్డారు. అంతే కాకుండా ఏకంగా ఓ స్థానికుడు మురుగు నీటి కాలువలోకి దిగి నిరసన తెలిపాడు.  నడుము లోతున్న మురుగు కాలువలోకి దిగి.. ఇలా ఉంటే నీరు ఎలా ప్రవహిస్తుందని.. గత తొమ్మిదేళ్ళుగా ఈ కాలువ ఎందుకు నిర్మించలేకపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ కాలనీకి వచ్చిన నిధులను ఇతర ప్రాంతాలకు మళ్ళించారంటూ సదరు నాయకులపై మండిపడ్డాడు. తర్వాత పోలీసులు, స్థానిక వైసీసీ కార్యకర్తలు అతడికి నచ్చజెప్పి  కాలువలో నుంచి బయటకు తీసుకొచ్చారు.

Exit mobile version