Site icon Prime9

MLA Maddisetty Venugopal: రాష్ట్ర ప్రభుత్వం పై దర్శి వైకాపా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్..

Ysrcp Darshi MLA sensational comments on the state government

Ysrcp Darshi MLA sensational comments on the state government

Andhra Pradesh: అధికార పార్టీ వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో వైసిపి కార్యకర్తలు మనోవేదనలకు గురౌతున్నారని దర్శి వైకాపా శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వైకాపా ప్లీనరీలో మాట్లాడిన అంశాలు నేడు నెట్టింట ట్రోల్ అవుతున్నాయి.

వీడియోలోని ఆయన మాటల్లో  వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంద కోట్ల వరకు తన నియోజకవర్గంలో కాంట్రాక్టులు జరిగాయన్నారు. ఇందులో తానే వ్యక్తిగతంగా పెద్దన్నను అడిగి మరీ 40కోట్ల వరకు కార్యకర్తల కొరకు కాంట్రాక్టులు తెప్పించానన్నారు. అయితే ప్రభుత్వం నుండి డబ్బులు అందకపోవడంతో వారందరిని అప్పులు పాలు చేశానని వైకాపా ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ప్రచారంలో కార్యకర్తల కుటుంబాలు పడుతున్న వ్యధలు తన దృష్టికి వచ్చాయన్నారు. కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలుగా అభివర్ణించారు. కాంట్రాక్ట్ డబ్బులు రాకపోవడంతో కొందరు కార్యకర్తలు సైతం తనకు దూరంగా ఉంటున్నారని సభా ముఖంగా పేర్కొన్నారు. దీంతోపాటు రోడ్లు ఎప్పుడు వేస్తారో, నాలుగు సిసి రోడ్లు ఎమ్మెల్యే తరపున వేస్తేనే గ్రామాల్లో తిరగ గలమని వైకాపా ఎమ్మెల్యే మాట్లాడారు. బటన్ నొక్కి నవరత్నాలను నేరుగా అందిస్తే ఆ క్రెడిట్ సీఎం జగన్ ఒక్కరికే చెందుతుందని ఎమ్మెల్యే తన మనసులోని బాధను వెళ్లగక్కారు. నెటిజన్లు ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతూ వైకాపా శ్రేణులను ఆటాడుకొంటున్నారు.

ఇది కూడా చదవండి: TDP Pattabhi Ram: సీఎం జగన్ బినామీ కంపెనీలకు వేల ఎకరాల భూమి ధారాదత్తం.. తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్

Exit mobile version