Site icon Prime9

Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెల 17న రైతు భరోసా నిధులు

apcm rythu bharosa second phase money released

apcm rythu bharosa second phase money released

Rythu Bharosa: ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత నిధులను అక్టోబరు 17న అర్ఙులైన లబ్ధిదారుల ఖాతాల్లో వేయనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. ఖరీఫ్‌లో ఇప్పటివరకూ 1.10 కోట్ల ఎకరాల్లో పంటలసాగు జరుగుతుందని, ఇంకా అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో నాట్లు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. గడిచిన మూడేళ్లలో ఉద్యానవన సాగు పెరిగిందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.

ధాన్యం కొనుగోలు విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పౌరసరఫరాల శాఖలతో సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నవంబర్ మొదటి వారం నుంచి రాష్ట్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పకడ్బందీగా సోషల్‌ ఆడిట్‌ పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ధాన్యం కొనుగోళ్ల కోసం 3,423 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. రైతులకు గిట్టుబాటు ధర కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  రంగు మారిన ధాన్యం, బ్రోకెన్‌ రైస్‌ నుంచి ఇథనాల్‌ తయారీపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పొగాకు రైతులకు నష్టం రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ధరలు పతనం కాకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: ఆ రైతుకు చలిమంటే చితిమంటైంది.. ఎంత ఘోరం !

 

Exit mobile version