Site icon Prime9

YS Vivkea Case: వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐ అఫిడవిట్‌లో సీఎం జగన్ పేరు

Ys jagan

Ys jagan

YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి.. సీబీఐ దాఖలు చేసిన అనుబంధ కౌంటర్ లో సీఎం జగన్ పేరును ప్రస్తావించింది. వివేకా హత్య విషయం సీఎం జగన్ కు ఉదయం 6గంటల 15 నిమిషాలకే తెలిసినట్లు ఇందులో సీబీఐ వెల్లడించింది. ఎంవీ కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే జగన్ కు తెలుసని కౌంటర్ అఫిడవిట్ లో వెల్లడించారు.

జగన్ పేరు ప్రస్తావన..

వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి.. సీబీఐ దాఖలు చేసిన అనుబంధ కౌంటర్ లో సీఎం జగన్ పేరును ప్రస్తావించింది. వివేకా హత్య విషయం సీఎం జగన్ కు ఉదయం 6గంటల 15 నిమిషాలకే తెలిసినట్లు ఇందులో సీబీఐ వెల్లడించింది. ఎంవీ కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే జగన్ కు తెలుసని కౌంటర్ అఫిడవిట్ లో వెల్లడించారు.

ఏపీలో వైఎస్ వివేకా హత్య సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి.

ఇందులో జగన్ పేరును ప్రస్తావించారు. అవినాశ్ రెడ్డి జగన్ కు చెప్పారా? లేదా? అనేదానిపై దర్యాఫ్తు చేయాల్సి ఉందన్నారు.

ఈ మేరకు అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ లో కీలక అంశాలు వెల్లడించింది. ఈ కేసులో మరింత సమాచారం కొరకు.. అవినాశ్ రెడ్డిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని సీబీఐ తెలిపింది.

ఈ కేసు విచారణలో భాగంగా.. దర్యాప్తుకు అవినాశ్ రెడ్డి సహకరించడం లేదని సీబీఐ వాదిస్తోంది.

హత్య జరిగిన రాత్రి 12.27 నుంచి 1:10 వరకు అవినాశ్ వాట్సాప్ కాల్స్ మాట్లాడారంది.

వివిద కారణాలు చెప్పి అనినాశ్ విచారణకు గైర్హాజరవుతున్నారని తెలిపింది.
ఆస్పత్రి వద్ద అవినాశ్ అనుచరులు భారీగా ఉండడంతో శాంతిభద్రల సమస్య రావచ్చని అనిపించింది.

జూన్ 30లోగా దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉన్నందున అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు” అని కౌంటర్ అఫిడవిట్ లో సీబీఐ కోరింది.

 

Exit mobile version