Site icon Prime9

Shiva Prasad Reddy: అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

shiva prasad

shiva prasad

Shiva Prasad Reddy: ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ పై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో నేరం రుజువైతే.. తనతో పాటు మరో 9 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని తెలిపారు. ఈ కేసులో అవినాష్‌రెడ్డిని అనవసరంగా ఇరికించారని ఆయన పొద్దుటూరు ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. కడపలో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నేరం రుజువైతే రాజీనామా.. (Shiva Prasad Reddy)

ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ పై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో నేరం రుజువైతే.. తనతో పాటు మరో 9 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని తెలిపారు. ఈ కేసులో అవినాష్‌రెడ్డిని అనవసరంగా ఇరికించారని ఆయన ఆరోపించారు. కడపలో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కడపలో నిర్వహించిన ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డితో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. ఒకవేళ సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించారు.

అవినాష్ రెడ్డిని కుట్రపూరితంగా అరెస్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారని  శివప్రసాద్‌ రెడ్డి ఆరోపించారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన షాక్ తో ఇక తన అరెస్ట్ తప్పదనే భావనకు ఆయన వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈక్రమంలో అవినాశ్ అరెస్ట్ పై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

ఇక అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదన్నారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన బెయిల్ పై బయటకు వస్తాడని అన్నారు.

ఈ హత్య కేసులో అవినాష్ నేరస్తుడిగా రుజువైతే.. రాజకీయాలను నుంచి పూర్తిగా తప్పుకుంటానని అన్నారు.

తనతో పాటు మరో తొమ్మిది మందిని రాజీనామా చేస్తారని మీడియాకు వివరించారు.

ఈ కేసులో చంద్రబాబు వెనకుండి.. అవినాష్ ను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని అన్నారు.

నిందితుడిగా చేర్చినంత మాత్రాన నేరం చేసినట్లు కాదు అంటూ వ్యాఖ్యానించారు.

అలాగే తన రాజీనామా గురించి క్లారిటీ ఇస్తు ముద్దాయిని చేస్తే రాజీనామా చేస్తామని చెప్పలేదు.

వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి నేరస్తుడిగా రుజువు అయితే రాజీనామా చేస్తానని అన్నారు.

న్యాయస్థానంలో అవినాశ్ రెడ్డి నేరస్థుడిగా రుజువైతే రాజీనామా చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నాను అంటూ స్పష్టం చేశారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.

Exit mobile version