Kodali Nani : ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించే అర్హత చంద్రబాబు లేదని.. వైకాపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఈ మేరకు తాడేపల్లి లోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో కడలి నని విరుచుకుపడ్డారు. చంద్రబాబు.. ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతున్నారు. చంద్రబాబును పొగిడించుకోవడానికే మహానాడు పెట్టారు అని మండిపడ్డారు. మహానాడు వేదిక మీద బాలకృష్ణ బొమ్మ ఎందుకు పెట్టలేదని.. ఎమ్మెల్యేగా కూడా గెలవని నారా లోకేష్ బొమ్మ ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరుతో నాలుగు ఓట్ల కోసమే ఈ తపనంతా అని నాని దుయ్యబట్టారు.
కాగా మహానాడులో వేదికగా టీడీపీ ఫేజ్ 1 మేనిఫెస్టోను చంద్రబాబు విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ మేనిఫెస్టోపై కొడాలి నాని (Kodali Nani) స్పందిస్తూ.. అధికారంలోకి రావడానికి చంద్రబాబు అనేక వాగ్దానాలను చేస్తున్నారని విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్నింటిని చంద్రబాబు నెరవేర్చారని ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు చర్చకు రావాలని సవాల్ విసిరారు. టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క హామీలు చంద్రబాబు నిర్వహించలేదని.. కానీ వైఎస్సార్ 2004లో ఇచ్చిన ప్రతీ హామీ చేసి చూపించారని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చినవే కాకుండా ఇవ్వని పథకాలు కూడా అమలు చేశారని కొనియాడారు.
2019లో రైతుల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు మాట తప్పారు. డ్వాక్రా రుణాలు మాఫీ అని చెప్పి మాఫీ చేయలేదు. చంద్రబాబు ఐదేళ్లలో పెన్షన్లకు రూ.22వేల కోట్లు ఖర్చు చేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.97వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. సెంటు స్థలం ఇస్తే సమాధికి సరిపోదు అంటున్నారు. 14ఏళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు పేదలకు ఎందుకు ఇళ్లు ఇవ్వలేదు. బీసీలకు చట్టం తెస్తానని చంద్రబాబు మోసపూరిత హామీ ఇచ్చారని విమర్శించారు.
చంద్రబాబు వెనుక బీసీలెవరూ లేరని.. చంద్రబాబు వెంట ఉన్నది.. రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు అని అన్నారు. వీళ్లెవరూ బీసీలు కాదని.. అధికారం ఇస్తే బాబుతో పాటు వీళ్లే బాగుపడతారని తెలిపారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే తన సామాజికవర్గానికే మంత్రి పదవులు ఇస్తారని.. చంద్రబాబును ఆల్‌ఫ్రీ బాబు అని వైఎస్సార్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు దొంగ, 420, ఔరంగజేబు అని ఎన్టీఆర్ ఆనాడే చెప్పారని.. బాబు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎంత ఇచ్చాడు అని క్వశ్చన్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చాడా.. టీడీపీ హయాంలో లోకేష్‌కు తప్ప రాష్ట్రంలో ఒక్కరికీ ఉద్యోగం రాలేదు అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కొడాలి నాని చేసిన కామెంట్స్ ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.