Site icon Prime9

Kalava Srinivasulu: ఓబులాపురం గనుల దోపిడి పార్ట్ 2కు తెరలేపిన వైకాపా ప్రభుత్వం

kalava-srinivasulu

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో విలువైన ఇనుప ఖణిజాలను పరులు పాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైందని, ఏపి ఎండీసి ద్వార ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ఓబులాపురం గనుల దోపిడి పార్ట్ 2 ప్లాన్ కు వైకాపా ప్రభుత్వం తెరతీసిందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ప్రైవేటు కాంట్రాక్టర్లకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో పై ఆయన మీడియాతో మాట్లాడారు.

ఓబులాపురం, పరిసర ప్రాంతాల్లో లభించే ఇనుప ఖణిజాన్ని కడప స్టీలు ప్లాంటుకు 75శాతం ఇవ్వాల్సి ఉండగా, ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పచెపితే ఆ లెక్కలను ఎవరు పర్యవేక్షిస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణాకు చెందిన ప్రముఖ ఏఎంఆర్ కంపెనీకి ధారాదత్తం చేసేందుకు అన్ని అగ్రిమెంట్లు పూర్తి అయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఇసుక, మట్టిని వదలకుండా యధేచ్చగా దోచుకుంటున్న వైకాపా నాయకులకు మరో రాచబాటగా తాజా ఒప్పందం మారనుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇందులో కొంతమంది మంత్రుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తులకు గనుల నిర్వహణ ఇస్తే విలువైన ఖణిజాన్ని ఇతరులకు అమ్ముకొనే వెసులుబాటును ఏపీ ఎండీసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారికి రహదారిగా చేసిందని ఆయన వివరించారు. గతంలోనే దొడ్డిదారిన పరులకు అప్పచెప్పేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలను గుర్తించామని, హెచ్చరికలు కూడా చేసామని తెలిపారు. ఓబులాపురం ఇనుప ఖణిజం దోపిడికి ఒప్పుకొనేది లేదని, అడ్డుకొనేందుకు స్థానికులతో కలిసి ఉద్యమానికి తెదేపా శ్రీకారం చుడుతుందని మాజీ మంత్రి కాల్వ పేర్కొన్నారు.

రాయదుర్గం శాసనసభ్యుడు కాపు రామచంద్రారెడ్డి నేతృత్వంలో సీబీఐ సీజ్ చేసిన ఇనప ఖణిజాన్ని సైతం పోర్టుకు తరలించి సొమ్ము చేసుకొంటున్నారని కాల్వ పేర్కొన్నారు. ఇప్పటికే దీనిపై కోర్టు దృష్టికి సంబంధిత వ్యక్తులు తీసుకెళ్లిన్నట్లు ఆయన అన్నారు. మేజిష్ట్రేట్ కోర్టు కూడా ఆదేశాలు జారీచేసిందని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రభుత్వం అండలేనిదో ఖణిజాన్ని తరలించడం అంతా ఆషామాషీ కాదని నొక్కి చెప్పారు. కుంభకోణాలు, కబ్జాలు, ప్రజల ఆస్తులు దోచుకొంటున్న వైకాపా పెద్దలు మరో భారీ దోపిడికి ప్లాన్ చేసారని, అడ్డగోలుగా తీసుకొచ్చిన ఓబులాపురం గనుల కాంట్రాక్ట్ జీవోను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: నిషేధించడమే పరిష్కారానికి మార్గం కాదు.. సీతారాం ఏచూరి

Exit mobile version