Site icon Prime9

Woman Rash Driving : విశాఖలో మద్యం మత్తులో రచ్చ రచ్చ చేసిన యువతి.. కారుతో బీభత్సం

Woman Rash Driving car in visakhapatnam and news got viral

Woman Rash Driving car in visakhapatnam and news got viral

Woman Rash Driving : విశాఖపట్నంలో ఓ యువతి వీరంగం సృష్టించింది. మద్యం మత్తులో మంగళవారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించింది. స్థానిక వీఐపీ రోడ్డులో ఇన్నోవా కారును నడుపుతున్న ఆమె అతి వేగంతో ఇతర వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెతోపాటు కారులో ప్రయాణిస్తున్న వారు అక్కడి నుంచి పరారయినట్లు సమాచారం అందుతుంది. ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా కారులో ఆ యువతితో పాటు పలువురు యువకులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

కాగా వీరంతా ముందుగా వీఐపీ రోడ్డులో ఉన్న సోమా రెస్టో బార్ అండ్ రెస్టారెంట్ లో ఫుల్ గా మద్యం సేవించారని.. ఆ తర్వాత పార్కింగ్ స్థలం నుంచి వీఐసీ రోడ్డులోని సిరిపురం వెళ్లే మార్గంలో వైపు వేగంగా వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ క్రమంలో కారు అదుపు తప్పి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. దీంతో పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన ఎనిమిది వాహనాలను కారు ఢీకొట్టడంతో ఆ వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే పార్కింగ్ స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో కారు కూడా దాదాపు 10 అడుగుల ఎత్తులో చెట్టుపైకి ఎక్కి ఆగింది.

AP 26BR 9 రిజిస్ట్రేషన్ నెంబర్ తో వాహనం యశ్వంత్ ములుక్త పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉంది. నెల్లూరు వేదయపాలెం అడ్రస్ తో రిజిస్ట్రేషన్ అయి ఉంది ఈ కారు. సోమ బార్ లోకి వాహనం వెళుతున్న సమయంలో డ్రైవింగ్ సీట్లో యువతి ఉన్నట్టు పోలీసుల ప్రాథమిక గుర్తించడంతో ఆమె ఎవరా అని విచారణ చేపట్టారు.

Exit mobile version