Amaravathi: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు నోటీసులు ఇచ్చిన ఏపీ మహిళా కమీషన్ కు పలు పార్టీల నేతల నుండి నిరసనలు గుప్పుమంటున్నాయి. ప్రతిపక్ష పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు నోటీసులు పంపించారు సరే, వైకాపా నేతల పట్ల మహిళా కమీషన్ ప్రవర్తిస్తున్న తీరును తెదేపా నేత వర్ల రామయ్య సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు.
వాసిరెడ్ది పద్మ గారూ! గతంలో మీ కమీషన్ చంద్రబాబు గారికి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఇచ్చింది.సరే! ఓ దళితుడు అప్పు తీర్చలేదని కడప జిల్లా మైదుకూరులో ఆ దళితుని భార్యను, ఓ వైకాపా నాయకుడు అపహరించి, తన ఇంట్లో బంధించి, అప్పు తీర్చేంత వరకు పంపేది లేదంటే,మీ కమీషన్ ఏమి చేస్తుందీ? అని వర్ల రామయ్య మహిళా కమీషన్ ను ప్రశ్నించారు.
ఇదే విధంగా నిన్నటిదినం జనసేన పార్టీ కూడా రాష్ట్రంలో చోటుచేసుకొన్న 18 అంశాలపై ఎందుకు వాసిరెడ్డి పద్మ స్పందించలేదంటూ సోషల్ మీడియా వేదికగా విల్లు ఎక్కుపెట్టారు. దీంతో అధికార పార్టీకి చుట్టంగా మారిన మహిళా కమీషన్ కు ప్రతిపక్ష పార్టీలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తలలు కొట్టుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Janasena Party: జనసేన సైనికుల్లారా పారాహుషార్.. అధికార పార్టీ కుట్రలు తిప్పి కొట్టండి.