Site icon Prime9

CM Jagan: మేనిఫెస్టోలో 95 శాతం హామీలను నెరవేర్చాం.. సీఎం జగన్

Prakasam district: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలక ప్రకటన చేసారు. ఏపీ ముందస్తు ఎన్నికల పై చర్చ జరుగుతున్న వేళ సీఎం జగన్ వాటికి పరోక్షంగా సమాధానం చెప్పారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు. వైయస్ఆర్ బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మొదలు పెట్టిన సంక్షేమ పనులను ఎక్కడా కూడా ఆపకుండా అన్ని పనులను చేశామని తెలిపారు. ఆయన కుమారుడిగా మరో నాలుగు అడుగులు ముందుకేసి సంక్షేమ పనులను అమలు చేస్తున్నామని జగన్ వెల్లడించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు 95 శాతం పూర్తి చేసామని తెలిపారు. ఈ మాట చెప్పడానికి తాను అర్హుడని భావిస్తున్నానని తెలిపారు.

గ్రానైట్ పరిశ్రమకు కొంత మంది మహా నేతలకు మరణం ఉంటుంది కానీ, వారు చేసిన మంచి పనులు మాత్రం ఎఫ్పిటీ శాశ్వతమని పేర్కొన్నారు. ఇదే సమయంలో కొన్ని కీలక అంశాల పైన జగన్ క్లారీటి ఇచ్చారు. ఎన్నికల అంశాన్ని కూడా ప్రస్తావించారు. 2023 వ సంవత్సరంలో ఏప్రిల్ 14న విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి సభాముఖంగా తెలియజేసారు. అలాగే గ్రానైట్ పరిశ్రమకు సంభందించిన హామీలు, గతంలో మేము చెప్పిన విధంగా శ్లాబ్ విధానం అమల్లోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసారు. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేశామని చెప్పారు. దీని కారణంగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్న చిన్న చిన్న వ్యాపారవేత్తలకు కూడా మేలు జరుగుతుందని చెప్పారు.

కరోనా వల్ల రెండేళ్ళు పాలన పై ప్రభావం పడింది. ముందస్తు ఎన్నికల పై క్లారిటీ ఇచ్చారు. ఏపీలో వచ్చే సెప్టెంబర్ తరువాతనే ఎన్నికలు ఉంటాయని ముఖ్యమంత్రి సభాముఖంగా జగన్ స్పష్టం చేసారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదనే చెప్పకనే చెప్పేసారు. షెడ్యూల్ ప్రకారం 2024 మొదటి త్రైమాసికంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ముఖ్యమంత్రి 2023 చివరి వరకు వరుసగా చేయాల్సిన కార్యక్రమాల ఉండటం వల్ల కొత్త షెడ్యూల్ ను ఇప్పటికే సిద్దం చేసినట్ట్లు తెలుస్తుంది.

Exit mobile version
Skip to toolbar