Site icon Prime9

Gundalakamma project: విరిగిన గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడవ గేటు.. సముద్రం పాలైన 12వేల క్యూసెక్కుల నీరు

GUNDALAKAMMA PROJECT

Andhra Pradesh: అధికారుల పర్యవేక్షణ లోపం, సరైన మరమ్మతులు లేకపోవడంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడవ గేటు విరిగిపోయింది. బుధవారం రాత్రి గేటు దిగువభాగం దెబ్బతినటంతో భారీస్థాయిలో నీరు వృథాగా పోతోంది. దీర్ఘకాలంగా గేట్లు నిర్వహణ, మరమ్మతుల్లో జరుగుతున్న నిర్లక్ష్యంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తుండగా ప్రాజెక్టులో ఉన్న నీటిలో అర టీఎంసీ నీరు గురువారం మధ్యాహ్నానికే దిగువకు వెళ్లిపోయాయి. దీనితో దెబ్బతిన్న గేటు మరమ్మతుల్లో యంత్రాంగం నిమగ్నమయింది.

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు నుంచి రెండో రోజు శుక్రవారం కూడా నీరు వృధాగా పోతోంది. బుధవారం రాత్రి గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడో గేటు కొట్టుకుపోయింది. స్టాప్‌ లాక్‌ ద్వారా నీటిని ఆపేందుకు ఇంజనీర్లు చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో 13, 14, 15 గేట్లు ఎత్తి ప్రాజెక్టులో నీటి వత్తిడిని అధికారులు తగ్గిస్తున్నారు. ఇప్పటికే 12వేల క్యూసెక్కుల నీరు సముద్రం పాలైంది. కాగా ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గడంతో రైతులు, మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

Exit mobile version