Viral News : అమ్మ.. ఈ పదం, ఈ పిలుపు నకు ఉన్న గొప్పతనాన్ని మాటల్లో వర్ణించలేం. ఆడవారు .. అమ్మ పిలుపు కోసం.. ఎన్ని కష్టాలను భరిస్తారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే మాత, పిత, గురు, దైవం అని అంటారు. దేవుడు కన్నా ముందు మనకి అమ్మే అని చెబుతున్నారు అంటే ఆ గొప్పతనాన్ని మనం అర్దం చేసుకోవాలి. కానీ కొంత మంది మహిళలకు ఉన్న సమస్యల కారణంగా అమ్మ తనానికి దూరం అవుతారు. బిడ్డల్ని దత్తత తీసుకోవడం ద్వారా, లేదా మరే ఇతర మార్గాల ద్వారా అయినా కూడా తల్లి అయిన వారు ఉన్నారు.
అయితే ఈ స్టోరీ గురించి చెప్పుకుంటే కన్నీళ్ళు కూడా ఆగవేమో అనిపిస్తుంది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ మహిళ వయస్సు 35 సంవత్సరాలు. ఆమెకు పెళ్లై 20 సంవత్సరాలు గడుస్తుంది. కానీ వివాహమైన నటి నుంచి పిల్లల కోసం ఎంతో ఎదురుచూసింది. తల్లి అవ్వాలనే తన కోరిక కోసం.. తిరగని హాస్పటల్స్, మొక్కని దేవుడు అన్నట్లు ప్రయత్నాలు చేసింది. ఈ 20 ఏళ్లలో కుటుంబ సభ్యులు, బంధువుల సూటిపోటి మాటలను కూడా భరించింది. ఇన్నాళ్ళూ ఎదురు చూసిన ఆమెకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయ్ అన్నట్టు ఆమె గర్భం దాల్చింది. దీంతో ఒక రకంగా చెప్పాలంటే ఆమె సంతోషానికి అవదులు లేవని చెప్పాలి. ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది. అయితే అమ్మా అని పిలిపించుకోవాలనే ఆమె కోరిక మాత్రం తెరకుండానే తనువు చాలించింది. ఆ ముగ్గురు బిడ్డలను తల్లి లేని పిల్లలను చేస్తూ అనంత లోకాలకు చేరింది. ఈ విషాద ఘటనతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు, మరెందరినో కంటతడి పెట్టిస్తుంది.
అందరినీ శోకాతప్త హృదయాలతో (Viral News) నింపిన ఈ దుర్ఘటన జరిగింది ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలంలోని పల్లగిరికి గ్రామంలో. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివసిస్తున్న చెందిన షేక్ ఖాసీం, నజీరా దంపతులకు 20 ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. ఖాసీం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఈ దంపతులు పెళ్లయిన నాటి నుంచి పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ వారికి సంతానం కలగలేదు. అనూహ్యంగా కొన్ని నెలల కిందట నజీరా గర్భం దాల్చింది. 20 ఏళ్ల తరువాత తమ కుటుంబంలోకి పిల్లలు రాబోతున్నారని ఆ దంపతులు కూడా ఎంతో సంబరపడ్డారు. కానీ ఆ సంతోషం ఎంతో రోజులు నిలువకుండానే వారి జీవితాల్లో విషాదం నిండింది.
పది రోజుల కిందట నజీరాకు పురిటి నొప్పులు రావడంతో.. ప్రసవం కోసం విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. డాక్టర్లు ఆమెకు సిజేరియన్ చేయగా ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో ఇద్దరు ఆడ పిల్లలు కాగా.. మరొకరు అబ్బాయి ఉన్నారు. అయితే నజీరాకు రక్తం తక్కువగా ఉందని.. డాక్టర్లు రక్తం ఎక్కించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆమె పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి నజీరా మృతి చెందింది. పిల్లలు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటనతో అంతా బాధలో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ వార్తా ఎందరినో కంటతడి పెట్టిస్తుంది.