Site icon Prime9

POCSO Court: సంచలన తీర్పునిచ్చిన విజయవాడ పోక్సో కోర్టు

Vijayawada POCSO Court gave a sensational verdict

Vijayawada POCSO Court gave a sensational verdict

Vijayawada: విజయవాడ పోక్సో కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్షను విధించింది. వివరాల మేరకు, నున్న ప్రాంతానికి చెందిన అనిల్ అనే వ్యక్తి ఏడేళ్ల బాలిక పై అత్యాచారం చేశాడు. దీంతో విచారణలో నిందితుడిని ముద్దాయిగా కోర్టు పరిగణించింది. నిందితుడు మరణించే వరకు జీవిత ఖైదీగా ధర్మాసనం తీర్పు నిచ్చింది.

ఓ టెంట్ హౌస్ లో పనిచేసిన అనిల్ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడని కేసు నిరూపణ కావడంతో అతనికి శిక్షను ఖరారు చేశారు. చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారికి ఇలాంటి తీర్పులు గుణపాఠంగా మారనున్నాయి.

ఇది కూడా చదవండి: గాలికి షాకిచ్చిన సుప్రీం కోర్టు

Exit mobile version