Site icon Prime9

Transgender Love Story : ఇద్దరు అబ్బాయిల ప్రేమ కథ.. చివరికి ట్రాన్స్‌జెండర్‌గా మారితే.. ఊహించని ట్విస్ట్ !

transgender love srory at vijayawada and news got viral

transgender love srory at vijayawada and news got viral

Transgender Love Story : ఇన్నాళ్ళూ అమ్మాయిలు అబ్బాయిలను.. అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేసిన ఘటనలు కోకొల్లలు గమనించవచ్చు. కానీ విజయవాడలో వింత ప్రేమకథ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మరింది.  అమ్మాయిగా మారిన మగాడు.. మరో మగాడి చేతిలో మోసపోవడం సంచలనంగా మారింది. ఇద్దరు స్నేహితులు కలిసి చదువుకున్న సమయంలోనే మధ్య ప్రేమ మొదలైంది.. ఇద్దరిలో ఒకరు ట్రాన్స్‌జెండర్‌డగా మారగా.. చివర్లో ప్రియుడు హ్యాండిచ్చి పారిపోయాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చసింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కృష్ణా జిల్లాకు చెందిన పవన్‌.. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ కృష్ణలంకకు చెందిన నాగేశ్వరరావు 2019లో ఒకే కాలేజీలో బీఈడీ పూర్తి చేశారు. వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇద్దరూ ఇక్కడ చదువుతూనే కృష్ణలంకలోని సత్యంగారి హోటల్‌ దగ్గర ట్యూషన్‌ సెంటర్‌ ప్రారంభించారు. అక్కడే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. పవన్‌కు అమ్మాయి లక్షణాలు ఉండడంతో నాగేశ్వరరావు అతడిపై మనసుపడ్డాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించగా.. ఇద్దరూ కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం ఢిల్లీలో వెజినో ప్లాస్టీ సర్జరీ ద్వారా పవన్‌ అమ్మాయిగా మారాడు.

నాగేశ్వరరావు దగ్గరుండి సర్జరీ చేయించాడు. ఆ తర్వాత పవన్ తన పేరును భ్రమరాంబగా మార్చుకున్నాడు. ఈ సర్జరీకి రూ.11 లక్షలు ఖర్చు చేశారు. అప్పటి నుంచి పవన్‌, నాగేశ్వరరావు సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. గతేడాది డిసెంబర్‌లో పెళ్లికి నిరాకరించిన నాగేశ్వరరావు ఆమెను ఇంటి నుంచి పంపించేశాడు. అక్కడి నుంచి తన తల్లి విజయలక్ష్మితో కలిసి మంగళగిరి వెళ్లిపోయాడు. దీంతో భ్రమరాంబ పెనమలూరులోని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు నాగేశ్వరరావు, అతడి తల్లి విజయలక్ష్మిలపై ఈ నెల పదో తేదీన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భ్రమరాంబ తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నాగేశ్వరరావు వివాహం చేసుకుంటాడన్న నమ్మకంతో 11 సవర్ల బంగారం, రూ.26 లక్షల డబ్బులు కూడా నాగేశ్వరరావుకు ఇచ్చినట్లు ఆమె తెలిపింది. నాగేశ్వరరావుతో కలిసి జీవించాలని నిర్ణయించుకున్న తర్వాత ఇలా చేశానని.. ఇప్పుడు పెళ్లికి నాగేశ్వరరావు మొహం చాటేశాడని కన్నీరు పెట్టుకుంది.

అయితే చివరికి తాను మోసపోయానని గ్రహించిన ఆమె.. నాగేశ్వరరావు మంగళగిరిలో ఉన్నాడన్న సమాచారంతో అతడిపై ఫిర్యాదు చేసేందుకు అక్కడి పోలీసులను ఆశ్రయించింది. అయితే వారు కృష్ణలంకలో ఫిర్యాదు చేయాలని సూచించడంతో ఇక్కడ ఫిర్యాదు చేసింది. ఈ ఘటన స్థానికంగా కూడా చర్చనీయాంశం అయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version