Site icon Prime9

Parvathipuram: విషాదం.. కరెంట్‌ షాక్‌తో నాలుగు ఏనుగులు మృతి

parvathipuram

parvathipuram

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘతంతో నాలుగు ఏనుగులు మృతిచెందాయి. ఈ ఘటన.. భామిని మండలం కాట్రగడ-బి సమీపంలోని పంట పొలాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

విద్యుత్ షాక్..

కొద్ది రోజులుగా..భామిని మండలం కాట్రగడ-బి సమీపంలోని పంట పొలాలను ఏనుగులు నాశనం చేస్తు వస్తున్నాయి. కాట్రగడ్డ సమీపంలో తీరుగుతున్న ఈ ఏనుగులు.. పంట పొలాల వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫార్మార్ కు తగిలి నాలుగు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో రెండు ఏనుగులు అక్కడినుంచి పరారయ్యాయి.

ఈ ఏనుగుల గుంపు ఒడిశా నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా.. ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతి చెందిన ఏనుగుల్లో ఒకటి మగ, మూడు ఆడ ఏనుగులు ఉన్నట్లు అటవీశాఖ సిబ్బంది తెలిపారు. ప్రమాద సమయంలో.. వెళ్లిపోయిన ఏనుగులు తిరిగి వచ్చి ఎలాంటి బీభత్సం సృష్టిస్తాయోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలేవరు కొండవైపు సమీప ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించారు.

ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి..

ఏపీ, తమిళనాడు సరిహద్దులో ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. జనారణ్యంలోకి వచ్చి అలజడి సృష్టిస్తున్నాయి. కుప్పం సరిహద్దులో తిష్ట వేసిన గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారు. సప్పానికుంటలో ఏనుగుల దాడిలో రైతు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఉషా అనే మహిళ ఏనుగుల దాడిలో చనిపోయింది. కూలీ పని కోసం బెంగళూరు వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు వెళ్తున్న సమయంలో దాడి చేశాయి. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

Exit mobile version