Site icon Prime9

Pawan Kalyan- Tollywood Producers: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు

AP Deputy CM Pawan Kalyan

AP Deputy CM Pawan Kalyan

Pawan Kalyan- Tollywood Producers: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను టాలీవుడ్ సినీ నిర్మాతలు కలిశారు. నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ, యెర్నేని నవీన్, రవిశంకర్, డీవీవీ దానయ్య, భోగవల్లి ప్రసాద్, విశ్వప్రసాద్, నాగవంశీలతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తదితరులు విజయవాడ క్యాంపు ఆఫీసులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు.

సమస్యలు వివరించిన నిర్మాతలు..(Pawan Kalyan- Tollywood Producers)

చిత్ర పరిశ్రమ సమస్యలను సినీ నిర్మాతలు పవన్ కళ్యాణ్ కు వివరించారు. సినిమా టికెట్ల ధర పెంపు వెసులుబాటుపై సమావేశంలో చర్చ జరిగింది. థియేటర్ల సమస్యలను కూడా నిర్మాతలు పవన్ దృష్టికి తీసుకెళ్లారు.పవన్‌తో భేటీ అనంతరం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్‌కి సినీ పరిశ్రమ తరపున శుభాకాంక్షలు తెలిపి కాసేపు మాట్లాడాం. సీఎం చంద్రబాబు నాయుడుతో అపాయింట్‌మెంట్ ఇప్పించాలని పవన్‌ని కోరాం. ఇండస్ట్రీకి చాలా సమస్యలు ఉన్నాయి. సినిమా టిక్కెట్ల ధరలు పెరగడం మాకు చాలా చిన్న విషయం. సీఎంను కలిస్తే మా సమస్యలను ప్రయారిటీ రూపంలో తెలియజేస్తాం అ ని చెప్పారు. ఇలా ఉండగా సినీ నిర్మాతలు చెప్పిన విషయాలను పవన్ కళ్యాన్ సావధానంగా విన్నారు. వారి సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చినట్లు సమాచారం.

గతంలో వైసీపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కు మధ్య పెద్దగా సంబంధాలు లేవు. వైసీపీ సర్కార్ ఆన్ లైన్ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు చేయాలనడం, బెనిఫిట్ షోలకు టికెట్ల అమ్మకాలకు అనుమతించకపోవడంతో సినిమా పెద్దలు అసంతృప్తి చెందారు. వీటిపై గతంలో టాలీవుడ్ పెద్దలు అప్పటి సీఎం జగన్ ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. కొంతమంది వైసీపీ నాయకులు టాలీవుడ్ పైన తమ దైన శైలిలో నోరు పారేసుకున్నారు. మొత్తంమీద గత ఐదేళ్లు ఏపీ టాలీవుడ్ ఏపీ ప్రభుత్వం వ్యవహారశైలిపైన అసంతృప్తిగా ఉందనే చెప్పవచ్చు. ఇపుడు చిత్ర పరిశ్రమే చెందిన పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉండటంతో టాలీవుడ్ లో మంచి జోష్ వచ్చింది. తమ సమస్యలు సులువుగా పరిష్కారమవుతాయన్న నమ్మకం కలిగింది.

 

 

Exit mobile version