Site icon Prime9

Tirumala : నేటి నుంచి తిరుమలలో శ్రీవారి పుష్కరిణి మూసివేత..

tirumala pushkarini closed for one month for forther arrangements

tirumala pushkarini closed for one month for forther arrangements

Tirumala : తిరుమలలో నేటి నుంచి శ్రీవారి పుష్కరిణి మూసివేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. కాగా ఇవాల్టి నుంచి నెల రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేయనున్నారు. దీంతో ఈ నెల రోజుల పాటు పుష్కరిణి హారతి రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొల‌గించి మ‌ర‌మ్మతుల‌ను పూర్తి చేయనున్నారు.. ఇక, మరమ్మతులు పూర్తి చేసి తర్వాత.. 10 రోజుల పాటు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా పరిశీలించి.. బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేయనుంది.

కాగా అధిక మాసం సందర్భంగా ఈ సారి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్న విషయం విదితమే. అధిక మాసం సందర్భంగా వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 18న ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఆరోజు ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున వేంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సెప్టెంబర్ 22వ తేదీన గరుడ సేవ, 23న స్వర్ణరథం, 25వ తేదీన రథోత్సవం, 26వ తేదీన చక్రస్నానం, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15న ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 19వ తేదీన గరుడ వాహనం, 22న స్వర్ణరథం, అక్టోబర్ 23న చక్రస్నానం నిర్వహిస్తామని చెప్పారు. శ్రీవారి అన్నప్రసాదం, ఇంజినీరింగ్ పనులు, దర్శనం, కళ్యాణకట్ట, రవాణా, వసతి, పోలీసు, వైద్యం, ఆరోగ్యం, హెచ్‌డిపిపి, ఉద్యానవనం, శ్రీవారి సేవకుల సమన్వయంతో టీటీడీ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగం భద్రతా ఏర్పాట్లపై సమీక్ష జరిగింది. రెండు బ్రహ్మోత్సవాలు ఉన్నందున తిరుమలకు ఈ ఏడాది భక్తుల రద్దీ అధికంగా ఉండనుంది. పురటాసి పవిత్ర మాసం సెప్టెంబర్ 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగియనుంది. సెప్టెంబరు 23, 30, అక్టోబర్ 7, 14 తేదీల్లో పురటాసి శనివారాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలతో పాటు పురటాసి శనివారాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.

 

Exit mobile version