MP Avinash Reddy: గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన.. వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. విశ్వభారతి ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఆస్పత్రి యాజమాన్యం ప్రెస్ నోట్ విడుదల చేసింది.
గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన.. వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. విశ్వభారతి ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఆస్పత్రి యాజమాన్యం ప్రెస్ నోట్ విడుదల చేసింది.
గత నాలుగు రోజులుగా కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. గుండెకు సంబంధించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. సోమవారం సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరు కావాల్సి ఉన్నప్పటికి.. ఆస్పత్రిలోనే ఉన్నారు.
ప్రస్తుతం శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. యాంజియోగ్రామ్ చేశాక.. ఆమె డబుల్ నాళాల వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది.
ప్రస్తుతం ఆమెకు క్రిటికర్ కేర్ యూనిట్ లో ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. మరికొన్ని రోజులు.. సీసీయూలో చికిత్స అందించే అవసరం ఉండవచ్చని వైద్యుల బృందం తెలిపింది.
వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారనే నేపథ్యంలో.. కర్నూలులో ఉద్రిక్తత కొనసాగుతుంది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
దీంతో ఆస్పత్రికి సీబీఐ అధికారులు వెళ్లడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో ఆస్పత్రి ఎదుట పోలీసులు బలగాలు భారీగా మోహరించారు.
ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
గత నాలుగు రోజులుగా.. వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మమ్మ దగ్గరే ఉన్నారు. ఆమె గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరారు.
ఇదే సమయంలో.. ఆస్పత్రి వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. ఇక సోమవారం విచారణకు హాజరు కావాలని.. సీబీఐ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.
అయితే మరోసారి తాను విచారణకు హాజరు కాలేనని.. అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు.
విచారణకు మరో వారం రోజులు గడువు కావాలని అవినాష్ కోరినట్లు సమాచారం. ఇప్పటికే పలు కారణాలతో.. ఆయన విచారణకు హాజరు కాలేదు.
దీంతో ఆయనను అరెస్ట్ చేయడానికి సీబీఐ సిద్దమైనట్లు తెలుస్తోంది.