East Godavari: ప్రేమించిన ప్రియురాలే.. ప్రియుడి గొంతుకోసి హత్య చేసిన ఘటన.. తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రేమించి ముఖం చాటేశాడని ఇంటికెళ్లి మరి ప్రియుడిని హతమార్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
నమ్మించి.. గొంతుకోసి
ప్రేమించిన ప్రియురాలే.. ప్రియుడి గొంతుకోసి హత్య చేసిన ఘటన.. తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపింది. ఈ హత్యతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రేమించి ముఖం చాటేశాడని ఇంటికెళ్లి మరి ప్రియుడిని హతమార్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
మెున్నటివరకు ప్రేమించిన అమ్మాయిలపై అబ్బాయిలు దాడులకు పాల్పడుతుంటే.. దానికి విరుద్దంగా ఓ యువతి యువకుడిని హత్య చేసింది. నాలుగేళ్లుగా ప్రేమించి.. ముఖం చాటేశాడని తెలిసి తట్టుకోలేక.. గోంతుకోసి హతమార్చింది.
ఈ ఘటన.. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం తిరుమలపాలెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నాగశేషు అనే యువకుడు.. రంపచోడవరం మండలం చిలకవీధికి చెందిన కుర్ల డెబొర అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి.. నాలుగేళ్లు ప్రేమించుకున్నారు.
కానీ నాగశేషు కుటుంబ సభ్యులు.. ఏడాది క్రితమే అతడికి మరో యువతితో వివాహం చేశారు. ఈ విషయాన్ని ప్రేమించిన యువతి వద్ద దాచిపెట్టాడు. కానీ పెళ్లి విషయం తెలిసిన యువతి.. నాగశేషుని నిలదీసింది. ఎలాగైన ప్రియుడిని చంపేయాలని నిశ్ఛయించుకున్న యువతి.. మరో స్నేహితుడితో కలసి.. అర్ధరాత్రి నాగశేషు ఇంటికి వెళ్లింది.
రాత్రి దాబాపై నిద్రిస్తున్న సమయంలో.. ప్రియుడి వద్దకు వెళ్లి కత్తితో దాడి చేసింది. తేరుకునే లోపే గోంతుకోసింది. ప్రియుడు కేకలు వేయడంతో.. స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే బాధితుడిని స్థానికి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితురాలికి సహకరించిన మరో యువకుడిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.