Site icon Prime9

Amaravati farmers : అమరావతి రైతుల పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ ..

Amaravati farmers

Amaravati farmers

Amaravati farmers : అమరావతి రైతులు తాము చేస్తున్న పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. .పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టుగా అమరావతి జేఏసీ ప్రకటించింది. కోర్టు నుంచి మళ్లీ ఆదేశాలు తీసుకొచ్చి పాదయాత్ర పునఃప్రారంభిస్తామని తెలిపారు. కోర్టు సెలవులు ఉన్నందున నాలుగు రోజుల పాటు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చినట్టు తెలిపారు.

ఐడీ కార్డులు ఉంటేనే పాదయాత్రలో పాల్గొనాలని పోలీసులు అంటున్నారని.. అయితే ఇదే విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేయాంటే కుదదంటున్నారని రైతులు తెలిపారు. ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటామని రైతులు చెబుతున్నారు.అమరావతి రైతుల పాదయాత్ర ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కొనసీమ జిల్లాకు చేరుకుంది. నేడు జిల్లాలోని రామచంద్రాపురం బైపాస్ రోడ్డు నుంచి రైతుల పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది.పోలీసులు పాదయాత్రను చుట్టు ముట్టి ఆనేక ఆంక్షలు విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మద్దతు తెలిపేవారిని రానివ్వకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారి ఎక్కడికక్కడ నిలిపేస్తున్నారని ఆరోపించారు.హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సాకుగా చూపించి 600 మంది గుర్తింపు కార్డులు అడగుతున్నారని అన్నారు.అనుమతి ఉన్న వాహనాలను తప్ప వేరే వాహనాలను అంగీకరించబోమంటున్నారని వివరించారు. ఈ క్రమలో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరుగుతోంది.

తాము చేపట్టిన పాదయాత్రను అడ్డుకుంటున్నారని అమరావతి పరిరక్షణ సమితి, రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాదయాత్రలో 600 మందికి మాత్రమే పరిమితం చేయాలని ఆదేశించింది. ఎలాంటి సంఘ వ్యతిరేక శక్తులు చొరబడకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూసేందుకు పాదయాత్రలో పాల్గొనేందుకు అనుమతించిన వారిని మినహాయించి ఎవరినీ అనుమతించవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. అలాగే ప్రత్యర్థి వర్గానికి చెందిన ఏ వర్గానికి అయినా పాదయాత్రకు సమీపంలో ఉండకుండా అనుమతులు ఇచ్చేటపుడు చూసుకోవాలని పోలీసులను ఆదేశించింది. పాదయాత్రలో నాలుగు వాహనాలకు మించి అనుమతించరాదని కోర్టు పోలీసులను ఆదేశించింది.రైతుల పాదయాత్రకు సంఘీభావాన్ని తెలియజేయాలనుకునే వ్యక్తులు యాత్రలో చేరకుండా.. రోడ్డుకు ఇరువైపల ఉండి సంఘీభావం తెలపాలని హైకోర్టు స్పష్టం చేసింది.

Exit mobile version