Site icon Prime9

Nara Chandrababu : చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ నిరాకరణ.. క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

supreme court postpone nara chandrababu quash petition

supreme court postpone nara chandrababu quash petition

Nara Chandrababu : తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పిటిషన్ పై పలుమార్లు వాదనలు వినిపించారు. పలుమార్లు వాయిదా కూడా పడింది. తాజాగా ఈరోజు జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా త్రివేదితో కూడిన ధర్మాసనం ముందు వాదనలు వినిపించిన అనంతరం తీర్పును రిజర్వ్ చేసి.. తిరిగి విచారణను శుక్రవారానికి (అక్టోబర్ 20) కి వాయిదా వేసింది.

ఈ సందర్భంగా మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. వాదనలు మిగిలి ఉంటే.. రాతపూర్వకంగా ఇవ్వాలంటూ ధర్మాసనం సూచించింది. కాగా.. చంద్రబాబు తరుపున సీనియర్ న్యాయవాది హరీష్‌ సాల్వే, సీఐడీ తరుపున ముకుల్‌ రోహత్గీ సుధీర్ఘ వాదనలు వినిపించారు. చంద్రబాబుకు 17A వర్తించదని సీఐడీ తరపున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. దాదాపు గంటన్నర సేపు ఆయన వాదనలు వినిపించారు. అవినీతి పరులను కాపాడేందుకు 17A అన్నది రక్షణ కవచం కాదని రోహత్గీ వాదించారు. ఈ కేసులో రాజకీయ కక్ష సాధింపు అనేది లేదని, అనేక దర్యాప్తు సంస్థలు దీనిపై విచారణ జరుపుతున్నాయని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.

Chandrababu’s Health

17A సెక్షన్‌ తర్వాత అమల్లోకి వచ్చినా అది కచ్చితంగా ఈ కేసులో వర్తిస్తుందని బాబు తరపున సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలు వినిపించారు. ఎన్నికల సమయంలో రాజకీయంగా ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు ఇలాంటివి ఉపయోగిస్తున్నారని అన్నారు. రెట్రాస్పెక్టివ్‌ ఎఫెక్ట్‌ గురించి అనేక సెక్షన్లు, తీర్పులను హరీష్‌ సాల్వే ప్రస్తావించారు. క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు సుదీర్ఘంగా సాగడంతో ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. అంత వరకు అరెస్టు చేయొద్దని గతంలో చేసిన సూచనలు కొనసాగుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

Exit mobile version