Site icon Prime9

Supreme Court : వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురు..

supreme court judgement on mp avinash reddy petition over viveka murder case

supreme court judgement on mp avinash reddy petition over viveka murder case

Supreme Court : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో ఎంపీ చేసిన అభ్యర్థనపై అత్యున్నత న్యాయస్థానం స్పందించలేదు. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టేలా ఆదేశించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి కోరగా.. రాతపూర్వక అభ్యర్థన ఇస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సూచించారు.

 

 

YouTube video player

Exit mobile version
Skip to toolbar