Site icon Prime9

Jr Ntr Fan Shyam : తన ఫ్యాన్ శ్యామ్ మృతిపై స్పందించిన జూ. ఎన్టీఆర్.. బయటికి వచ్చిన శ్యామ్ సెల్ఫీ వీడియో.. అసలు నిజాలేంటో స్పెషల్ స్టోరీ !!!

special story on jr ntr fan shyam death

special story on jr ntr fan shyam death

Jr Ntr Fan Shyam : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వీరాభిమానుల్లో శ్యామ్ ఒక‌డు. తూర్పు గోదావ‌రి జిల్లాలోని కొప్పిగుంట గ్రామానికి చెందిన శ్యామ్‌..  విశ్వ‌క్ సేన్ హీరోగా చేసిన “దాస్ కా ధ‌మ్కీ” ప్రీ రిలీజ్‌ కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వ‌చ్చిన‌ప్పుడు స్టేజ్‌పై సెక్యూరిటీని దాటి మరీ ఎన్టీఆర్ తో ఫోటో దిగాడు. ఆ ఫొటో, వీడియోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. అయితే రెండు రోజుల క్రితం శ్యామ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

శ్యామ్ మృతిపై అనుమానాలు.. 

శ్యామ్ ఉరి వేసుకుని మృతి చెందినట్లు సంఘటన స్థలంలో పోలీసులు, స్థానికులు గుర్తించారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే అతని స్నేహితులు, కుటుంబ స‌భ్యులు మాత్రం త‌న మృతిపై అనుమానాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. వైర‌ల్ అవుతున్న ఫోటోలను చూస్తుంటే వారి అనుమానం కూడా నిజ‌మేనేమో అనిపించేలా కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి.

అనుమానాలకు దారి తీస్తున్న విషయాలు ఏంటంటే.. 

శ్యామ్ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా.. ఏదైనా కారణంతో అతడిని చంపేసి ఆత్మహత్యలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా? అని అనుమానించేలా ఆ ఫోటోలు ఉన్నాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా శ్యాం కుటుంబానికి మద్దతుగా నిలబడుతున్నారు. శ్యాం మృతి మీద దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించాలంటూ వైసీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వెలుగులోకి వచ్చిన శ్యామ్ మృతి ఫోటోలో అతని కాళ్లు భూమిపైన ఆని ఉన్నాయి. శ్యామ్ నిజంగానే ఉరి వేసుకుని చనిపోతే అతని కాళ్లు భూమిమీద ఎందుకు ఉంటాయి. మెడ దగ్గర ఉరి వేసుకున్న ఆనవాళ్లు ఎందుకు లేవు? ముఖం, ముక్కు మీద గాయాలు ఎందుకు ఉన్నాయి? చేతి దగ్గర ఎవరో కోసినట్లుగా ఎందుకు కనిపిస్తోంది? అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

దీంతో శ్యామ్ కు న్యాయం జరగాలని ఇతర హీరోల అభిమాన సంఘాలతో పాటు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నిఖిల్, నిర్మాత ఎస్కెఎన్, టాలీవుడ్ పిఆర్ఓలు ముక్త కంఠంతో వీ స్టాండ్ విత్ శ్యామ్ అంటూ విచారణ  కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇక ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయగా.. ఇంకా దర్యాప్తు ప్రాధమిక దశలోనే ఉందని సమాచారం.

మనసు కలిచి వేస్తోంది – ఎన్టీఆర్

కాగా తాజాగా ఈ విషయంపై ఎన్టీఆర్ స్పందించారు. శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన అని ఓ లేఖని విడుదల చేశారు. శ్యామ్ కుటుంబానికి ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ”ఎటువంటి పరిస్థితుల్లో, ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలిచి వేస్తుంది” అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ”ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని తారక్ రిక్వెస్ట్ చేశారు.

వెలుగులోకి సెల్ఫీ వీడియో.. 

అయితే మరోవైపు తాజాగా శ్యామ్ సెల్ఫీ వీడియో బయటికి వచ్చింది. ఆ వీడియోలో సెల్ఫీ వీడియోలో.. ‘అమ్మా, నాన్న నన్ను క్షమించండి. నేను అందరి దృష్టిలో వేస్ట్. నేను ఉన్నా.. మీకు ఉపయోగం లేదు. నాకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు.

 

Exit mobile version