Site icon Prime9

Ap High Court: ఏపీ సర్కార్ కు హై కోర్టులో భంగపాటు

Setback to the AP government in the High Court

Setback to the AP government in the High Court

Amaravati: చట్టాలు, మార్గదర్శకాలు, పద్ధతులను అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం గాల్లోకి వదిలేసింది. ఈ నేపథ్యంలో న్యాయస్ధానాల నుండి పలుమార్లు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగులుతోంది. ఇలాంటి పరిణామాలు ఏపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయాయి. తాజాగా సింగిల్ జడ్జ్ తీర్పు పై హైకోర్టు డివిజినల్ బెంచ్ స్టే ఇచ్చింది. దీంతో ప్రభుత్వానికి మరోపాటు భంగపాటు తప్పలేదు.

వివరాల్లోకి వెళ్లితే, రాష్ట్రంలోని 1681 మిడ్ లెవల్ హెల్త్ సూపర్ వైజర్ పోస్టుల భర్తీ వ్యవహారం కోర్టు కెక్కింది. ప్రభుత్వానికి అనుకూలంగా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ డివిజినల్ బెంచ్ కు రిట్ పిటిషన్ చేసుకొన్నారు. దీంతో వాదనలు విన్న అనంతరం సింగిల్ జడ్జి తీర్పు పై డివిజినల్ బెంచ్ స్టే ఇచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ కు విరుద్ధంగా ఆయుష్ డాక్టర్ల పేర్లను పరిశీలనలోకి తీసుకోకుండా, హెల్త్ సూపర్ వైజర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. దీనిపై పిటిషన్ దారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే వాదనల సమయంలో ప్రభుత్వం తరపున భర్తీకి అవకాశం ఇవ్వాలని, రాబోయే ఎంపికల్లో వారి పేర్లు కూడ పరిశీలనలోకి తీసుకొంటామని ప్రభుత్వ న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. కానీ, మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో మొత్తం ప్రక్రియ పై స్టే విధిస్తున్నట్లు న్యాయస్ధానం పేర్కొనింది.

గడిచిన మూడున్నర సంవత్సర కాలంలో పరిపాలనలో అనేక పర్యాయాలు న్యాయస్ధానాల నుండి మొట్టికాయలు, స్టేలు, భంగపాటులు కలుగుతున్నా, ప్రభుత్వంలో మాత్రం ఏమాత్రం చలనం రావడం లేదు. దీంతో ప్రజలకు, సంబంధిత వ్యక్తులకు పరిష్కారంలో తీవ్ర జాప్యం చోటుచేసుకొంటుంది.

ఇది కూడా చదవండి: సంచలన తీర్పునిచ్చిన విజయవాడ పోక్సో కోర్టు

Exit mobile version