Site icon Prime9

AP High Court: రుషికొండ కేసు.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Rushikonda case.. High Court's harsh comments

Rushikonda case.. High Court's harsh comments

Amaravati: విశాఖలోని రుషికొండ తవ్వకాల అంశంలో సాగతుతున్న విచారణలో ఏపి ప్రభుత్వం పై హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. విచారణ నేపథ్యంలో, ధర్మాసనం తన మాటల్లో, రుషి కొండ తవ్వకాలపై కేంద్ర అటవీ శాఖ కమిటీ వేస్తానంటే ఎందుకు అడ్డుకుంటున్నారా? ప్రభుత్వం వైపు ఏదో దాచి పెడుతున్నట్లు అనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

రుషికొండ పై 9.88 ఎకరాలకు అనుమతిస్తే 20 ఎకరాల్లో తవ్వకాలు జరిపారంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందుకు సంబంధించిన గూగుల్ మ్యాప్ ఫోటోలను కూడా సమర్పించారు. ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అనుమతి మేరకు తవ్వకాలు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై న్యాయస్ధానం స్పందిస్తూ ఫోటోలు అబద్దాలు చెబుతున్నాయా? అని ప్రశ్నించారు. కొంత సమయం కావాలని అఫిడవిట్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది కోరారు. తదుపరి విచారణను ధర్మాసనం నవంబర్ 3కి వాయిదా వేసింది.

ఇప్పటికే రుషికొండలో పర్యావరణానికి విఘాతం కల్గిందని పత్రికలు, మీడియా, ప్రతిపక్షాలు కోడై కూస్తున్నా, ప్రభుత్వం మాత్రం అలాంటిది ఏమీ లేదని బుకాయిస్తుంది. తాజా తీర్పుతో ఏపీ ప్రభుత్వంలో తప్పక అలజడి ప్రారంభమౌతుంది.

ఇది కూడా చదవండి: ఏపీ సర్కార్ కు హై కోర్టులో భంగపాటు

Exit mobile version